దిల్లీ వీడే ముందు జామా మసీదుకు ఆజాద్‌

‘పౌరసత్వ’ ఆందోళనల్లో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ అలియాస్‌ ‘రావణ్‌’ నేడు మరోసారి జామా మసీదు వద్దకు వెళ్లారు. దిల్లీ విడిచి వెళ్లేందుకు గడువు దగ్గరపడుతున్న సమయంలో

Published : 18 Jan 2020 00:33 IST

దిల్లీ: ‘పౌరసత్వ’ ఆందోళనల్లో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ అలియాస్‌ ‘రావణ్‌’ నేడు మరోసారి జామా మసీదు వద్దకు వెళ్లారు. దిల్లీని విడిచి వెళ్లేందుకు గడువు దగ్గర పడుతున్న సమయంలో మసీదు వద్దకు వెళ్లిన ఆజాద్‌.. అక్కడ ఆందోళనకారులతో కూర్చుని రాజ్యాంగ ప్రవేశిక చదివారు. 

కోర్టు ఆదేశాలను, బెయిల్‌ నిబంధనలను ఉల్లంఘించి తాను ఎలాంటి ఆందోళనల్లో పాల్గొనట్లేదని, కేవలం రాజ్యాంగ ప్రవేశిక మాత్రమే చదివానని ఆజాద్‌ ఈ సందర్భంగా తెలిపారు. అంతకుముందు ఆర్కే ఆశ్రమంలోని వాల్మీకీ ఆలయాన్ని సందర్శించిన ఆజాద్‌.. గురుద్వారా, చర్చికి కూడా వెళ్లనున్నట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు రాత్రి 9 గంటల్లోగా ఆయన దిల్లీ విడిచి వెళ్లాలి. ఈ లోగా ఆజాద్‌ మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది.

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జామా మసీదు వద్ద ఆందోళన చేపట్టినందుకు గానూ డిసెంబరు 21న ఆజాద్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున గురువారం రాత్రి కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే 24 గంటల్లోగా ఆజాద్‌ దిల్లీ విడిచి వెళ్లాలని, నాలుగు వారాల వరకు నగరానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని