ఉద్యోగం కావాలంటే.. మాతృభాష చదవాల్సిందే

అసోం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే కనీసం పదో తరగతి వరకు స్థానిక అస్సామీ భాషను తప్పనిసరి చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని మాధ్యమాల పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హిమనంత్‌ బిశ్వ శర్మ వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో టేబుల్‌ ఐటెమ్ కింద...

Published : 27 Jan 2020 02:05 IST

దిస్పూర్‌: అసోం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే కనీసం పదో తరగతి వరకు స్థానిక అస్సామీ భాషను తప్పనిసరి చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని మాధ్యమాల పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హిమనంత్‌ బిశ్వ శర్మ వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో టేబుల్‌ ఐటెమ్ కింద ఈ బిల్లును సభలో ప్రవేశపెడతామన్నారు. అంతేకాకుండా లోయ ప్రాంతంలోని బోడోల్యాండ్‌ టెర్రిటోరియల్‌ అటానమస్‌ జిల్లాల్లోనూ స్థానిక  బెంగాలీ, బోడో భాషలను కచ్చితంగా అభ్యసించాలన్నారు. అప్పుడే స్థానిక విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులవుతారని స్పష్టం చేశారు. తన ఇద్దరు కొడుకులు కూడా ఇతర రాష్ట్రాల్లో చదువుకున్నారని, అందువల్ల రాష్ట్రంలోని ఏ ప్రభుత్వం ఉద్యోగానికీ వారు అర్హులు కారని మంత్రి స్పష్టం చేశారు.

మరోవైపు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రూ.3 వేలకోట్లు ఖర్చుచేస్తున్నట్లు మంత్రి బిశ్వశర్మ పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయిలో 15,000 ఉపాధ్యాయపోస్టులు, సెకెండరీ స్థాయిలో మరో 8,000 పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా  1 నుంచి 8 తరగతుల వారికి 4 జతలు, 9వ, 10వ తరగతి విద్యార్థులకు 2 జతల యూనిఫాంలను ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని