ఆ దేశాలకు వెళ్లొద్దు: ఉగ్రవాదులకు ఐసిస్‌ సూచన

ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ఇప్పుడు కరోనా వైరస్‌కు(కొవిడ్‌-19) భయపడుతోంది. కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న

Published : 15 Mar 2020 15:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ఇప్పుడు కరోనా వైరస్‌కు (కొవిడ్‌-19) భయపడుతోంది. కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆ వైరస్‌ ప్రభావిత దేశాలకు వెళ్లొద్దంటూ ఐసిస్‌ తమ ఉగ్రవాదులకు సూచించింది. కరోనా మహమ్మారి వ్యాపించిన దేశాలకు వెళ్లొద్దంటూ తమ ‘అల్‌-నబా’ మ్యాగజైన్‌లో ప్రచురించింది.

అంతేకాదు, ఎప్పటికిప్పుడు చేతులు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఉగ్రవాదులకు తెలిపింది. మధ్యరాత్రిలో నిద్రలేచినా సరే, చేతులు కడుక్కొని పడుకోవాలని తెలిపింది. అనారోగ్యంత బాధపడేవారికి దూరంగా ఉండటంతో పాటు, కరోనా ప్రభావిత దేశాలకు వెళ్లొద్దంటూ ఐసిస్‌ ప్రకటన విడుదల చేసినట్లు డైలీ మెయిల్‌ తెలిపింది. ఆరోగ్య నిపుణులు సూచించిన జాగ్రత్తలు పాటించాలని, బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని తెలిపింది.

ప్రస్తుతం చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా, ప్రపంచదేశాల్లో వ్యాపిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి 5వేలమంది చనిపోగా, 1.35లక్షలమందికి కరోనా సోకింది. భారత్‌లో కరోనా బారినపడిన వారి సంఖ్య 93కే చేరగా, ఇద్దరు చనిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని