చివరి కోరిక వెల్లడించని నిర్భయ దోషులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు ఎట్టకేలకు పరిసమాప్తం అయ్యింది. దోషులను కొద్దిసేపటి క్రితం దిల్లీలోని తిహాడ్‌ జైలులో ఉరితీశారు...

Updated : 20 Mar 2020 07:23 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు ఎట్టకేలకు పరిసమాప్తం అయ్యింది. నలుగురు దోషులను దిల్లీలోని తిహార్‌ జైలులో ఒకేసారి ఉరితీశారు. ముకేశ్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్త (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ (31)ను ఉరి తీసేముందు చివరి కోరికలు ఏమైనా ఉన్నాయా అని జైలు అధికారులు అడగ్గా వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అనంతరం ఉరితీత ప్రక్రియను పూర్తి చేశారు. నలుగురు దోషులు మరణించారని వైద్యులు ధ్రువీకరించిన తర్వాత వారి మృతదేహాలను శవాగారానికి తరలించారు.  రాత్రంతా ఈ నలుగురు దోషులను ప్రత్యేకంగా వేర్వేరు గదుల్లో ఉంచినట్లు తెలుస్తోంది. ఉదయం 5:30 గంటలకు 17 సిబ్బంది మధ్య వారిని ఉరితీశారు. ఈ సమాచారం బయటకు తెలియగానే తీహార్‌ జైలు ఎదుట పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి మిఠాయిలు పంచుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని