అప్పుడు స్పానిష్‌ఫ్లూను.. ఇప్పుడు కరోనాను

1920 ప్రాంతంలో ప్రపంచాన్ని స్పానిష్‌ ఫ్లూ పట్టి పీడించిన సంగతి తెలిసిందే. మళ్లీ వందేళ్ల తర్వాత కరోనా వైరస్‌తో ప్రపంచం గజగజ వణికిపోతోంది. ఈ రెండు

Published : 26 Apr 2020 00:50 IST

మాడ్రిడ్‌: 1918 ప్రాంతంలో ప్రపంచాన్ని స్పానిష్‌ ఫ్లూ పట్టి పీడించిన సంగతి తెలిసిందే. మళ్లీ వందేళ్ల తర్వాత కరోనా వైరస్‌తో ప్రపంచం గజగజ వణికిపోతోంది. ఈ రెండు మహమ్మారుల బారిన వాటిని జయించి నిలిచింది 106 సంవత్సరాల అనా డెల్‌. స్పెయిన్‌కు చెందిన అనా 1913లో జన్మించింది. ప్రస్తుతం కరోనా మాదిరిగానే.. నాడు 1918 నుంచి 1920 మధ్యకాలంలో స్పానిష్‌ ఫ్లూ విజృంభించింది. అప్పట్లోనే 500 మిలియన్ల మందికి ఈ వ్యాధి సోకింది. వారిలో అనా కూడా ఉన్నారు. 1918లో చిన్నారిగా ఉన్న, నాటి మహమ్మారి స్పానిష్‌ ఫ్లూను తట్టుకుని బతికింది. 

ఇప్పుడు కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో స్పెయిన్‌ ఒకటి. 102 సంవత్సరాల అనంతరం అనాకు ఇప్పుడు కూడా కరోనా వైరస్ సోకింది. ఈ మహమ్మరి దెబ్బకు ఆ దేశంలో 22,524 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో 106 సంవత్సరాల అనా.. కొవిడ్‌-19 బారిన పడి మళ్లీ కోలుకున్నారు. స్థానిక పట్టణంలో ఉన్న నర్సింగ్‌ హోమ్‌లో 60 మంది ఇతర కొవిడ్‌-19 బాధితులతో పాటు ఆమె కూడా చికిత్స పొందింది. కొద్ది రోజుల తర్వాత కోలుకోవడంతో వైద్యులు ఆమె డిశ్చార్జీ చేశారు. ఇంకో ఆరునెలల్లో ఆమెకు 107 సంవత్సరాలు నిండుతాయి. కరోనాను జయించిన అతి పెద్ద వయస్కురాలిగా నెదర్లాండ్స్‌కు చెందిన కొర్నీలయా రాస్‌ పేరున రికార్డు ఉంది. అయితే స్పానిష్‌ ఫ్లూ, కరోనా రెండింటినీ తట్టుకున్న వారిలో అనా వయస్సే అతి పెద్దదట. అయితే ఆమె వయస్సు దృష్ట్యా ఆమె చాలా జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని