అన్ని రకాల వీసాలు నిలిపేసిన ప్రభుత్వం

విదేశీయులకు అనుమతించిన అన్ని రకాల వీసాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిలిపివేసింది. కొన్నింటికి మాత్రమే మినహాయింపు ఇచ్చింది. కరోనా వైరస్‌ మహమ్మారి ముప్పుతో విమాన ప్రయాణాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే....

Published : 05 May 2020 20:18 IST

దిల్లీ: విదేశీయులకు అనుమతించిన అన్ని రకాల వీసాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిలిపివేసింది. కొన్నింటికి మాత్రమే మినహాయింపు ఇచ్చింది. కరోనా వైరస్‌ మహమ్మారి ముప్పుతో విమాన ప్రయాణాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

లాక్‌డౌన్‌ కారణంగా భారత్‌లోనే చిక్కుకుపోయిన కొందరు విదేశీయుల వీసాలను మాత్రం మానవతా దృక్పథంతో పొడగిస్తున్నామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరో ఆదేశం జారీ చేసింది. అంతర్జాతీయ గగన ప్రయాణాలు ఆరంభమయ్యాక 30 రోజుల వరకు ఈ గడువు ఉంటుందని తెలిపింది.

జీవితకాలంలో ఎన్నిసార్లైనా ప్రవేశించేందుకు ప్రవాస భారతీయుల (ఓసీఐ)కు ఇచ్చిన వీసాలను సైతం నిలిపివేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే భారత్‌లో ఉన్నవారు ఎన్నాళ్లైనా ఉండొచ్చని వెల్లడించింది. దౌత్య, ఉపాధి, ఐరాస కార్యాలయాలు, ప్రాజెక్టుల కోసం ఇచ్చిన వీసాలకు సస్పెన్షన్‌ నుంచి మినహాయింపు ఉంటుందని కేంద్రం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని