కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..!

ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న నైరుతి రుతుపవనాలు భారత్‌కు రానే వచ్చాయి. ఈ నైరుతి రుతుపవనాల ఆగమనం కేరళలోకి సోమవారం ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మోహపాత్ర వెల్లడించారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అనుకున్న సమయానికే రుతుపవనాలు చేరుకున్నాయని తెలిపారు.

Updated : 01 Jun 2020 14:13 IST

ప్రకటించిన భారత వాతావరణ శాఖ

దిల్లీ: ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు భారత్‌కు రానే వచ్చాయి. ఈ నైరుతి రుతుపవనాల ఆగమనం కేరళలోకి సోమవారం ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహోపాత్ర వెల్లడించారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అనుకున్న సమయానికే రుతుపవనాలు చేరుకున్నాయని తెలిపారు.

అయితే, నైరుతి రుతుపవనాల ఆగమనం ఈసారి కాస్త ఆలస్యం కానుందని వాతావరణశాఖ తొలుత అంచనా వేసిన విషయం తెలిసిందే. జూన్‌ 5న కేరళ తీరాన్ని తాకవచ్చని ప్రకటించిన ఐఎండీ.. వాతావరణ మార్పులతో జూన్‌ 1నే చేరుకుంటాయని గత నాలుగు రోజుల క్రితం స్పష్టం చేసింది. అంచనాకు తగినట్లుగానే రుతుపవనాల ఆగమనం ప్రారంభం కావడంతో రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా దేశంలో ఈ సారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని గత నెలలోనే భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జూన్‌-సెప్టెంబర్‌ మధ్యలో పడే వర్షాలపైనే దేశంలో దాదాపు సగానికి పైగా వ్యవసాయ సేద్యం ఆధారపడి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని