Antibodies: 7 నెలల తర్వాత కూడా తగ్గని యాంటీబాడీలు 

కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారిలో యాంటీబాడీలు ఏడు నెలల తర్వాత కూడా స్థిరంగా కొనసాగుతున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.

Updated : 07 Aug 2021 11:28 IST

లండన్‌: కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారిలో యాంటీబాడీలు ఏడు నెలల తర్వాత కూడా స్థిరంగా కొనసాగుతున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. కొంతమందిలో అవి పెరగడాన్నీ గమనించామన్నారు. సాధారణ జలుబును కలిగించే కరోనా వైరస్‌లను లక్ష్యంగా చేసుకొనే యాంటీబాడీలు కలిగి ఉన్నవారికీ..కొవిడ్‌ నుంచి రక్షణ లభించొచ్చని తెలిపారు. స్పెయిన్‌లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

కరోనా  పరిణామక్రమాన్ని అంచనావేసి, దాన్ని ఎదుర్కోవడానికి సమర్థ వ్యూహాలు అవసరం. ఇందులోభాగంగా.. కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఎంత కాలం కొనసాగుతుందన్నది గుర్తించడం కీలకమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందుకోసం వారు.. గతేడాది మార్చి నుంచి అక్టోబరు మధ్య 578 మంది ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది నుంచి నాలుగు భిన్న సమయాల్లో రక్త నమూనాలు సేకరించి, పరిశీలించారు. కరోనాలోని ఆరు భిన్న భాగాలపై పనిచేసే ఐజీఏ, ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీల స్థాయిని కొలిచారు. కరోనాలోని న్యూక్లియోక్యాప్సిడ్‌ను లక్ష్యంగా చేసుకునే ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీలు మినహా.. మిగతా ఐజీజీ యాంటీబాడీలు స్థిరంగా కొన్ని నెలల పాటు కొనసాగినట్లు తేల్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని