గనిలో చిక్కుకొని.. 96 గంటలు తవ్వి..

ఓ బొగ్గు గనిలో చిక్కుకున్న నలుగురు కార్మికులు 96 గంటల పాటు నిర్విరామంగా తవ్వి ప్రాణాలను కాపాడుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, పోలీసులు సాయం అందించలేకపోయినా వారే స్వయంగా గని నుంచి బయటపడ్డారు. ఝార్ఖండ్‌ బొకారో

Updated : 01 Dec 2021 11:41 IST

బొగ్గు గనిలో చిక్కుకున్న నలుగురు కార్మికులు 96 గంటల పాటు నిర్విరామంగా తవ్వి ప్రాణాలను కాపాడుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, పోలీసులు సాయం అందించలేకపోయినా వారే స్వయంగా గని నుంచి బయటపడ్డారు. ఝార్ఖండ్‌ బొకారో బొగ్గు గనిలో ఈ ఘటన జరిగింది. పర్వత్‌పుర్‌ బ్లాక్‌లో పని చేసే  శ్రవణ్‌ రజ్వార్‌, లక్ష్మణ్‌ రజ్వార్‌ అనాడి సింగ్‌, భరత్‌ సింగ్‌ నవంబరు 26న గనిలో ప్రమాదం జరిగినప్పుడు తప్పిపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న మరికొంతమంది కార్మికులను స్థానికులు కాపాడారు. మరుసటి రోజు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈ నలుగురిని బయటకు తీసుకురాలేకపోయారు. వీరు మాత్రం జీవితంపై ఆశలు వదులుకోలేదు. తమ వద్ద ఉన్న పార, గునపాలతో తవ్వడం ప్రారంభించారు. అలా 96 గంటల పాటు నిర్విరామంగా తవ్వి గని నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. తమ నలుగురి వద్ద టార్చి లైట్లు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ఒక టార్చిని ఉపయోగిస్తున్నప్పుడు మిగతా వాటిని వాడలేదని కార్మికులు చెప్పారు. నాలుగు రోజుల పాటు కేవలం నీళ్లు తాగినట్లు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని