Elephants: ఊళ్లోకి 200 ఏనుగుల దండు

అస్సాంలోని నగావ్‌ జిల్లా సగున్‌బాహి గ్రామంలో ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేసింది. 

Updated : 30 Dec 2021 12:29 IST

అస్సాంలోని నగావ్‌ జిల్లా సగున్‌బాహి గ్రామంలో ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేసింది. ఏకంగా 200 ఏనుగులు జనావాసాల్లోకి చొరబడ్డాయి. భారీసంఖ్యలో గజరాజులను చూసిన గ్రామస్థులు ఒక్కసారిగా అచేతనులయ్యారు. అటవీశాఖ అధికారుల సాయంతో ఆ ఏనుగుల గుంపును మళ్లీ అడవిలోకి పంపే ప్రయత్నం చేశారు. ఆహారం కోసం వెదుక్కొంటూ గజరాజులు గ్రామంలోకి ప్రవేశించాయని నగావ్‌ అటవీ సంరక్షణాధికారి రాజేన్‌ సైకియా తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని