ఇతర రకాల కంటే ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువే

కరోనాలో ఇతర రకాలతో పోలిస్తే కొత్తదైన ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువేనని, ఆసుపత్రిలో చేరాల్సి వస్తున్నవారి సంఖ్యా

Updated : 04 Jan 2022 17:56 IST

ఆసుపత్రిలో చేరాల్సినవారి సంఖ్యా స్వల్పమే

 దక్షిణాఫ్రికా అధ్యయనంలో వెల్లడి 

జొహన్నెస్‌బర్గ్‌: కరోనాలో ఇతర రకాలతో పోలిస్తే కొత్తదైన ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువేనని, ఆసుపత్రిలో చేరాల్సి వస్తున్నవారి సంఖ్యా స్వల్పమేనని దక్షిణాఫ్రికాలో ఒక అధ్యయనంలో తేలింది. దీనిని నిపుణులు ఇంకా సమీక్షించాల్సి ఉంది. ఒమిక్రాన్‌ కేసులు ఎక్కువగా వచ్చిన తొలి నాలుగు వారాల్లో ఆసుపత్రుల్లో చేరిన రోగుల వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. గౌటెంగ్‌ ప్రావిన్సులో బీటా, డెల్టా రకాలు మొదటి నాలుగు వారాల్లో చూపిన తీవ్రతను, ఒమిక్రాన్‌ ఉద్ధృతిని వీరు పోల్చిచూశారు. ప్రయోగశాలల నుంచి పీసీఆర్, యాంటీజెన్‌ పరీక్షల పాజిటివ్‌ కేసుల వివరాలను పరిశీలించారు. మూడు ఉద్ధృతుల్లో తీవ్రతను మదించడానికి గణిత నమూనాలపై ఆధారపడ్డారు. రెండు, మూడు ఉద్ధృతుల్లో వరసగా 18.9%, 13.7% మంది ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తే ప్రస్తుతం అది 4.9% మించలేదు. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న కేసులు 2, 3 ఉద్ధృతుల్లో 60.1%, 66.9% ఉంటే ఇప్పుడు 28.8 శాతం ఉన్నాయి. డెల్టా రకంతో పోలిస్తే ఆసుపత్రుల్లో చేరాల్సిన వారు 73% తక్కువే ఉంటారని పరిశోధకుల అంచనా. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని