యూపీలో కూలిన నాలుగంతస్తుల భవనం

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో ఘోర ప్రమాదం జరిగింది. హజ్రత్‌గంజ్‌ ప్రాంతంలో మంగళవారం నాలుగంతస్తుల భవనం ఒకటి కుప్పకూలిపోయింది.

Published : 25 Jan 2023 06:05 IST

శిథిలాల్లో చిక్కుకున్న పలువురు
9 మందిని కాపాడిన సిబ్బంది

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో ఘోర ప్రమాదం జరిగింది. హజ్రత్‌గంజ్‌ ప్రాంతంలో మంగళవారం నాలుగంతస్తుల భవనం ఒకటి కుప్పకూలిపోయింది. శిథిలాల్లో పలువురు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 9 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించాయి. ఉత్తరాదిలో మంగళవారం భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ నేపథ్యంలోనే భవనం కూలిపోయినట్లు భావిస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న 9 మంది కాపాడినట్లు యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్‌ పాఠక్‌ వెల్లడించారు. ముగ్గురు అపస్మారకస్థితిలో ఉన్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని