తాతయ్య చెప్పాడని.. హెలికాప్టర్‌లో వచ్చాడు

నవవధువును తీసుకువెళ్లేందుకు ఓ వరుడు హెలికాప్టర్‌లో వచ్చాడు. తాతయ్య, నానమ్మల కోరిక తీర్చేందుకు మనవడు చేసిన ప్రయత్నమిది.

Published : 29 Jan 2023 04:22 IST

నవవధువును తీసుకువెళ్లేందుకు ఓ వరుడు హెలికాప్టర్‌లో వచ్చాడు. తాతయ్య, నానమ్మల కోరిక తీర్చేందుకు మనవడు చేసిన ప్రయత్నమిది. రాజస్థాన్‌ రాష్ట్రంలోని కోటా జిల్లా బంధ ధర్మపురకు చెందిన సునీల్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా పట్టణానికి చెందిన రేఖా అనే యువతిని గత గురువారం వివాహం చేసుకున్నాడు. దిల్లీ నుంచి ఓ హెలికాప్టర్‌ అద్దెకు తీసుకున్న పెళ్లికొడుకు.. తాతయ్య, నానమ్మలతో కలిసి పెళ్లికూతురి ఊరికి వెళ్లాడు. వధువును హెలికాప్టర్‌లో ఎక్కించుకొని గ్రామంలో ఏడు రౌండ్లు తిరిగాడు. అన్ని కార్యక్రమాలు ముగించుకొని తిరిగి వధువుతో సొంతూరుకు బయలుదేరాడు. హెలికాప్టర్‌లో వచ్చిన కొత్తజంటను చూసేందుకు జనం  భారీగా ఎగబడ్డారు.

ఈటీవీ భారత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని