అమర్త్యసేన్‌పై భూ ఆరోపణలు నిరాధారమైనవి

విశ్వభారతి విశ్వవిద్యాలయంలో భూవివాదానికి సంబంధించిన భూ దస్త్రాలను అమర్త్యసేన్‌కు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందించారు.

Published : 31 Jan 2023 03:57 IST

ఆయనను ఎవరూ ప్రశ్నించలేరు
మమతా బెనర్జీ వ్యాఖ్య

బోల్‌పుర్‌: విశ్వభారతి విశ్వవిద్యాలయంలో భూవివాదానికి సంబంధించిన భూ దస్త్రాలను అమర్త్యసేన్‌కు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందించారు. ఇకపై ఈ విషయంలో ఆయన్ను ఎవరూ ప్రశ్నించలేరని ఆమె వ్యాఖ్యానించారు. బీర్బూమ్‌లోని సేన్‌ నివాసం వద్ద పోలీసు క్యాంపు పెట్టాలని అధికారులను ఆదేశించారు. సోమవారం బోల్‌పుర్‌లోని అమర్త్యసేన్‌ నివాసానికి వచ్చిన మమత.. ఆయనపై వర్సిటీ చేసిన ఆరోపణలను ఖండించారు. ‘‘అమర్త్యసేన్‌ భూఆక్రమణ చేశారనేది నిరాధారమైన ఆరోపణ. ఆయన ప్రతిష్ఠను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన్ను కించపరిచే హక్కు ఎవరికీ లేదు. దీన్ని మేం ఉపేక్షించం. భూమి విషయంలో ఇకపై ఆయన్ను ఎవరూ ప్రశ్నించలేరు. త్వరలో ఆయనకు జెడ్‌ప్లస్‌ భద్రతను కల్పిస్తాం. వర్సిటీ అంటే నాకు గౌరవం ఉంది. కానీ బెంగాల్‌ నుంచి వేరుపడిన ఓ ద్వీపంలా పనిచేస్తోంది. విశ్వభారతీని కాషాయీకరణ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నాను’’ అని దీదీ అన్నారు. సేన్‌ ఎలాంటి భూఆక్రమణకు పాల్పడలేదని.. అన్ని రికార్డులు పరిశీలించామని, ఆయన తండ్రి 1.3 ఎకరాల విస్తీర్ణం గల భూమి లీజుకు తీసుకున్నట్లు గుర్తించామని బెంగాల్‌ ప్రభుత్వం ఓ  ప్రకటన విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని