చనిపోయాడనుకొని ఖననం చేశారు.. కానీ స్నేహితుడికి వీడియో కాల్‌!

కుటుంబసభ్యులు అతడు చనిపోయాడు అనుకున్నారు. ఖననం కూడా చేశారు. కొద్దిరోజులకు సామాజిక మాధ్యమం ద్వారా లైవ్‌ వీడియోలో కనిపించాడు.

Updated : 07 Feb 2023 11:11 IST

పాల్‌ఘర్‌: కుటుంబసభ్యులు అతడు చనిపోయాడు అనుకున్నారు. ఖననం కూడా చేశారు. కొద్దిరోజులకు సామాజిక మాధ్యమం ద్వారా లైవ్‌ వీడియోలో కనిపించాడు. ఏముంది పోలీసుల వేట ప్రారంభమయింది. మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌కు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు రఫిక్‌ షేక్‌ ఆటోరిక్షా నడిపేవాడు. ఆయన గత రెండు నెలల క్రితం కనిపించకుండా పోయాడు. అదే సమయంలో బోయసర్‌, పాల్‌గఢ్‌ స్టేషన్‌ల మధ్య ఓ వ్యక్తి హత్య జరిగింది. పోలీసులకు అనుమానం వచ్చి కేరళలో ఉంటున్న షేక్‌ భార్యకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన ఆమె.. చనిపోయింది తన భర్తేనని పొరపాటుగా నిర్ధరించింది. దీంతో ఆయనకు ఖననం సైతం చేసేశారు. కొద్ది రోజుల అనంతరం షేక్‌ సామాజిక మాధ్యమం ద్వారా తన స్నేహితుడికి వీడియో కాల్‌ చేశాడు. కంగుతిన్న స్నేహితుడు.. షాక్‌తో ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు. చనిపోయిన వ్యక్తి, షేక్‌ ఒకటి కాదని వారు నిర్ధరించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని