త్వరగా అస్సాం వీడండి

మహారాష్ట్రలోని ఎంవీఏ ప్రభుత్వాన్ని కూల్చడానికి శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు గువాహటి హోటల్‌లో బస చేయడం అస్సాం ప్రజలకు నచ్చడం లేదని ఆ రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు భూపేన్‌ బొరా అన్నారు. వీలైనంత త్వరగా

Published : 25 Jun 2022 06:58 IST

శిందేకు అస్సాం పీసీసీ అధ్యక్షుడి లేఖ

ఈనాడు, గువాహటి: మహారాష్ట్రలోని ఎంవీఏ ప్రభుత్వాన్ని కూల్చడానికి శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు గువాహటి హోటల్‌లో బస చేయడం అస్సాం ప్రజలకు నచ్చడం లేదని ఆ రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు భూపేన్‌ బొరా అన్నారు. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచిస్తూ తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందేకు శుక్రవారం బొరా లేఖ రాశారు. ఈ ఉత్తరాన్ని రాడిసన్‌ బ్లూ హోటల్‌ వద్ద విధుల్లో ఉన్న ఒక పోలీసు అధికారి ద్వారా అసమ్మతి నేత శిందేకు పంపించినట్లు తెలిపారు. అస్సాంలోని మొత్తం 35 జిల్లాలకు గాను 32 జిల్లాల ప్రజలు వరదలతో సతమతమవుతున్నారని, ఈ సమయంలో గువాహటిలో మహారాష్ట్ర ఎమ్మెల్యేలు బస చేయడం, వారికి రాజభోగాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమవడం ఏమాత్రం సబబుగాలేదన్నారు. ప్రజాస్వామ్య విలువలు, విధేయతల పట్ల గౌరవం లేని ఎమ్మెల్యేలకు ఆతిథ్యమిచ్చి అస్సాం అపకీర్తిని మూటకట్టుకుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని