నవమి రోజున వరించిన అదృష్టం

దసరా వేళ ఓ వ్యక్తి పంట పండింది. ఓ విలువైన వజ్రం అతణ్ని రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ నొయిడాకు చెందిన రాణా ప్రతాప్‌ మధ్యప్రదేశ్‌లోని సిరస్వాహాలోని భర్కా ప్రాంతంలో ఓ గనిని లీజుకు తీసుకున్నారు.

Published : 07 Oct 2022 07:10 IST

ఒక్క వజ్రంతో లక్షాధికారిగా..

దసరా వేళ ఓ వ్యక్తి పంట పండింది. ఓ విలువైన వజ్రం అతణ్ని రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ నొయిడాకు చెందిన రాణా ప్రతాప్‌ మధ్యప్రదేశ్‌లోని సిరస్వాహాలోని భర్కా ప్రాంతంలో ఓ గనిని లీజుకు తీసుకున్నారు. ఆరు నెలలుగా తవ్వకాలు జరుపుతుండగా.. నవమి రోజున (మంగళవారం) అతనికి 9.64 క్యారట్ల నాణ్యమైన వజ్రం దొరికింది. దీంతో అతని కుటుంబసభ్యులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆ వజ్రాన్ని పన్నాలోని డైమండ్‌ ఆఫీస్‌లో డిపాజిట్‌ చేసినట్లు రాణా ప్రతాప్‌ తెలిపారు. ఈ వజ్రం విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని అంచనా. దీన్ని రానున్న డైమండ్‌ ఆక్షన్‌లో ఉంచనున్నట్లు తెలిపిన రాణా ప్రతాప్‌.. వేలం ద్వారా వచ్చిన డబ్బులో కొంతభాగం పేద పిల్లల సహాయం కోసం ఖర్చు చేస్తానని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని