Bharat Jodo Yatra: రాహుల్‌ను కలిసిన వేళ.. ఆ బాలిక ఆనందం వర్ణనాతీతం

కాంగ్రెస్‌ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ 18వ రోజుకు చేరుకుంది. పార్టీ ప్రధాన నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో విజయవంతంగా సాగుతోంది.........

Updated : 29 Sep 2022 08:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కాంగ్రెస్‌ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ 18వ రోజు కొనసాగుతోంది. పార్టీ ప్రధాన నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో విజయవంతంగా సాగుతోంది. కాగా ఈ యాత్రలో ఇప్పటికే పలు ఉద్విగ్న సన్నివేశాలు చోటుచేసుకోగా.. తాజాగా మరో ఆసక్తిర ఘటన వెలుగుచూసింది. రాహుల్‌ను కలిసిన ఓ పాఠశాల విద్యార్థిని సంబ్రమాశ్చర్యాలకు లోనై.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆమె చేయిపట్టుకొని రాహుల్ ముందుకు సాగుతుండగా పట్టరాని సంతోషంతో గెంతులేస్తూ ఏడ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘భారత్‌ జోడో’ ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసిన కాంగ్రెస్‌.. ‘ఎలాంటి క్యాప్షన్‌ అవసరం లేదు కేవలం ప్రేమ’ అంటూ పేర్కొంది. ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 3లక్షల మంది వీక్షించారు.

కాళ్లకు బొబ్బలొస్తున్నా రాహుల్‌ గాంధీ ఈ యాత్రను కొనసాగిస్తున్నారు. మలప్పురంలో ముగిసిన యాత్ర రాహుల్‌ నియోజకవర్గమైన వయనాడ్‌కు చేరుకుంది. వయనాడ్‌లోని స్థానికులతో రాహుల్‌ మాట్లాడుతున్న వీడియోలను సైతం ట్విటర్‌లో పంచుకుంది. అంతకుముందు మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన రైతులతో కాంగ్రెస్‌ అగ్రనేత మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని