Precaution Dose: ప్రికాషన్‌ డోసు.. ఆ వార్తలు నమ్మొద్దు

కరోనా టీకాలపై కేంద్రం శనివారం కీలక ప్రకటన చేసింది. రెండు డోసు తర్వాత ప్రికాషన్‌ డోసు తీసుకునే కాల వ్యవధిని తగ్గించలేదని వెల్లడించింది.  ప్రికాషన్‌ డోసుకు కాల వ్యవధి 9 నెలలే అని స్పష్టం చేసింది

Published : 30 Apr 2022 12:06 IST

కాల వ్యవధిపై కేంద్రం స్పష్టత

దిల్లీ: కరోనా టీకాలపై కేంద్రం శనివారం కీలక ప్రకటన చేసింది. రెండు డోసు తర్వాత ప్రికాషన్‌ డోసు తీసుకునే కాల వ్యవధిని తగ్గించలేదని వెల్లడించింది.  ప్రికాషన్‌ డోసుకు కాల వ్యవధి 9 నెలలే అని స్పష్టం చేసింది. 

కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా ఈ ఏడాది ఆరంభంలో ప్రికాషన్‌ డోసు పంపిణీని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండు డోసు తీసుకున్న తర్వాత 9 నెలలకు ప్రికాషన్‌ డోసు తీసుకోవాలని వెల్లడించింది.  అయితే ఈ కాల వ్యవధిని 6 నెలలకు తగ్గించాలంటూ గతంలో ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రికాషన్‌ డోసు కాలవ్యవధిని కేంద్రం తగ్గించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు నేడు స్పందించాయి. కాల వ్యవధిని తగ్గించలేదని, రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాతే ముందు జాగ్రత్త డోసు వేయించుకోవాలని మరోసారి స్పష్టం చేశాయి.

జనవరి 10 నుంచి దేశంలో మూడో డోసు పంపిణీ ప్రారంభమైంది. తొలి దశలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న వృద్ధులకు ప్రికాషన్‌ డోసు అందించారు. అయితే ఏప్రిల్‌ 10 నుంచి 18 ఏళ్ల పైబడిన అందరూ ప్రికాషన్‌ డోసు వేయించుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. కాగా.. ప్రైవేటు కేంద్రాల ద్వారా ఈ డోసును పంపిణీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని