Modi: మోదీ ‘డిగ్రీ’ని చూపించాల్సిన అవసరం లేదు.. కేజ్రీవాల్‌కు జరిమానా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) విద్యార్హతను తెలిపే సర్టిఫికేట్లను చూపించాల్సిన అసవరం లేదని గుజరాత్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు సీఐసీ గతంలో ఇచ్చిన ఆదేశాలను కోర్టు కొట్టేసింది.
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) విద్యార్హతల వ్యవహారంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) భంగపాటు ఎదురైంది. ఈ అంశంపై గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ప్రధాని డిగ్రీ, పీజీ పత్రాలను పీఎంవో చూపించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఏడేళ్ల క్రితం కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసిన న్యాయస్థానం.. కేజ్రీవాల్‌కు రూ.25వేల జరిమానా కూడా విధించింది. అసలేం జరిగిందంటే..
ప్రధాని మోదీ (PM Modi) విద్యార్హతలపై ఆరోపణలు చేస్తున్న కేజ్రీవాల్.. ఆయన డిగ్రీ, పీజీ సర్టిఫికెట్ల (Degree, PG Certificates) కోసం 2016లో సహచట్టం ద్వారా కేంద్ర సమాచార కమిషన్ (CIC)కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును పరిశీలించిన సీఐసీ.. మోదీ డిగ్రీ, పీజీ పత్రాలను చూపించాలంటూ పీఎంవో కార్యాలయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (పీఐవో), గుజరాత్, దిల్లీ యూనివర్శిటీల పీఐవోలను 2016 ఏప్రిల్‌లో ఆదేశించింది. అయితే మూడు నెలల తర్వాత సీఐసీ ఆదేశాలను సవాల్ చేస్తూ గుజరాత్ యూనివర్శిటీ.. రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. దీంతో సీఐసీ ఆదేశాలపై అప్పుడు హైకోర్టు స్టే విధించింది.
ఇటీవల ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిపై హైకోర్టు గత నెల విచారణ జరిపింది. గుజరాత్ యూనివర్శిటీ (Gujarat University) తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘‘మోదీ విద్యార్హతలను దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఆ వివరాలు ఇప్పటికే పబ్లిక్ డొమైన్‌లో, యూనివర్శిటీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రజాస్వామ్యంలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి డాక్టరేట్ అయినా.. నిరక్షరాస్యుడైనా పెద్ద భేదమేమీ ఉండదు. అంతేగాక.. ఈ వివరాలను ప్రత్యేకంగా బయటపెట్టడంలో ప్రజా ప్రయోజనమేం లేదు. ఇక ప్రధాని (Modi) వ్యక్తిగత గోప్యతపై ఇది ప్రభావం చూపుతుంది. ఓ వ్యక్తి బాధ్యతారహితమైన అత్యుత్సాహానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని తుషార్ మెహతా వాదించారు. అయితే, ఈ వాదనలను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది ఖండించారు. ఆ పత్రాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో లేవని, ఆధారాల కోసమే వాటి కాపీలను అడుగుతున్నామని తెలిపారు.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నేడు కీలక తీర్పు వెలువరించింది. మోదీ సర్టిఫికెట్లను (Modi Certificates) పీఎంవో గానీ.. యూనివర్శిటీ గానీ చూపించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ సందర్భంగా ఆ పత్రాలను కోరిన కేజ్రీవాల్‌కు రూ.25వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా గుజరాత్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీలో జమ చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై స్టే ఇచ్చేందుకు కూడా కోర్టు నిరాకరించింది. కాగా.. ప్రధాని మోదీ 1978లో గుజరాత్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్, 1983లో దిల్లీ యూనివర్శిటీ నుంచి పీజీ పూర్తిచేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Delhi liquor Scam: రాఘవ్ బెయిల్ 15 నుంచి 5 రోజులకు కుదింపు
-
Viral-videos News
Viral Video: పట్టాలపైకి పరుగున వెళ్లి.. నిండు ప్రాణాలు నిలిపి.. మహిళా కానిస్టేబుల్ సాహసం!
-
India News
Odisha Train Tragedy: మృతదేహాలను పెట్టిన స్కూల్ కూల్చివేత.. ఎందుకంటే..?
-
Sports News
World Cup: డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉచితంగానే ఆసియా కప్, వరల్డ్ కప్
-
Movies News
Kevvu Karthik: సందడిగా జబర్దస్త్ కెవ్వు కార్తిక్ వివాహం.. హాజరైన ప్రముఖులు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు