Rahul Gandhi: నా దగ్గర KTM 390 బైక్‌ ఉంది.. కానీ, బయటకు తీయను.. ఎందుకంటే..?

దిల్లీలోని కరోల్‌బాగ్‌లోని బైక్‌ మెకానిక్‌ (Bike Mechanic) షాపులను సందర్శించిన రాహుల్‌గాంధీ.. అక్కడి వర్కర్లతో ముచ్చటించారు.

Updated : 09 Jul 2023 15:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఇటీవల దేశ రాజధాని వీధుల్లో పర్యటించిన విషయం తెలిసిందే. దిల్లీలోని కరోల్‌బాగ్‌లోని బైక్‌ మెకానిక్‌ (Bike Mechanic) షాపులను సందర్శించిన ఆయన.. అక్కడి వర్కర్లతో ముచ్చటించారు. అంతేకాకుండా వారితో కలిసి కొన్ని బైక్‌లను రిపేర్‌ (Bike Repair) చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తన వద్ద ఉన్న బైక్‌ గురించీ ప్రస్తావించిన రాహుల్‌.. దాన్ని ఎందుకు బయటకు తీయరో వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియో రాహుల్‌ గాంధీ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేశారు.

‘నా దగ్గర కేటీఎం 390 బైక్‌ ఉంది. కానీ, దాన్ని నేను వినియోగించను. దాన్ని (KTM 390 Bike) నడిపేందుకు నా భద్రతా సిబ్బంది అనుమతించరు. మీ సమస్యలను తెలుసుకునేందుకు నేను ఇక్కడకు వచ్చాను’ అని మెకానిక్‌లతో రాహుల్‌ గాంధీ చెప్పారు. మీ పెళ్లి గురించి..? ఎప్పుడు జరుగుతుంది..? అని మెకానిక్‌లు అడిగిన ప్రశ్నలకు మాత్రం రాహుల్‌ స్పందించలేదు.

భారత్‌ జోడో యాత్ర పేరుతో ఇటీవల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం వివిధ వర్గాల వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోన్న రాహుల్‌.. వారితో ముచ్చటించిన వీడియోలను తన యూట్యూబ్‌ ఛానెల్‌లో షేర్‌ చేస్తున్నారు. ఇటీవల అమెరికా పర్యటనలోనూ 190కి.మీ మేర ట్రక్‌లో ప్రయాణించారు. అంతకుముందు దిల్లీ నుంచి చంఢీగఢ్‌కు ట్రక్‌లో ప్రయాణించి డ్రైవర్లతో ముచ్చటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని