భారత గళాన్ని ప్రపంచం శ్రద్ధగా వింటోంది

భారత ఉత్పత్తులతోపాటు, దేశ గళం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోందని..

Updated : 08 Sep 2020 15:27 IST

దిల్లీ: భారత ఉత్పత్తులతోపాటు, దేశ గళం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశ గళాన్ని యావత్తు ప్రపంచం ఇప్పుడు మరింత శ్రద్ధగా వింటోందని పేర్కొన్నారు. ప్రధాని రాజస్థాన్‌లోని జైపూర్‌లో పత్రికా గేట్‌ను ప్రారంభించి, గ్రూప్ ఛైర్మన్ గులాబ్ కొఠారి రచించిన రెండు పుస్తకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతరం పుస్తకాలు చదవడాన్ని అలవాటుగా చేసుకోవాలని సూచించారు. పుస్తకాలు జీవితంలో భాగమవ్వాలని పేర్కొన్నారు. గూగుల్‌ వచ్చినంతమాత్రాన అపారమైన జ్ఞానాన్ని అందించే పుస్తకాలు చదవడాన్ని విస్మరించొద్దని సూచించారు. భారత మీడియా సైతం ప్రపంచ నలుమూలలకు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా ముఖ్య భూమిక పోషించిందన్నారు. ప్రభుత్వ పనులను విశ్లేషించడం, లోపాలను ఎత్తిచూపడం ద్వారా ప్రజలకు అపూర్వ సేవలు అందిస్తోందని కొనియాడారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని