Flight : విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో సాంకేతిక సమస్య.. మరో ఇంజిన్‌ సాయంతో సేఫ్‌ ల్యాండింగ్‌!

మదురై-ముంబయి వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానం (flight) ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో పైలట్‌ మరో ఇంజిన్‌ను వినియోగించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. 

Published : 29 Aug 2023 15:57 IST

ముంబయి : మదురై నుంచి ముంబయి వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానంలో (flight) సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇంజిన్‌ ఆగిపోయింది. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించి మరో ఇంజిన్‌ సాయంతో సురక్షితంగా ఆ విమానాన్ని ముంబయి విమానాశ్రయంలో ల్యాండ్‌ చేశారు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై విమానయాన సంస్థ ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది. ‘మదురై నుంచి ముంబయికి వెళ్తున్న ఫ్లైట్‌ 6ఈ-2012 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ముంబయిలో ల్యాండింగ్ కాక ముందే ఈ విషయం మా దృష్టికి వచ్చింది. దాంతో పైలట్‌ ముంబయిలో విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం ఆ విమానం ముంబయి విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. అవసరమైన మరమ్మతులు పూర్తయిన తర్వాత తిరిగి కార్యకలాపాలు కొనసాగిస్తాం. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అంటూ అందులో పేర్కొంది. 

ఆ ఆత్మహత్యలు నన్ను ఎంతగానో కలచివేశాయి: ‘సూపర్ 30’ ఆనంద్‌ కుమార్‌

ప్రాట్‌ & విట్నీ ఇంజిన్‌లలో ఇటీవల తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ తరహా ఇంజిన్‌ల అసమర్థత, సరఫరాలో వాటి తయారీదారులు చేస్తున్న జాప్యం కారణంగా ఇండిగోకు సంబంధించిన సుమారు 40 విమానాలు కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. గో ఫస్ట్ సంస్థకు సైతం ఇదే అనుభవం ఎదురైంది. ఫలితంగా ఇండిగో, గో ఎయిర్‌కు చెందిన 52 విమానాలు కొన్ని నెలలుగా దిల్లీ విమానాశ్రయంలో పార్క్‌ చేసి ఉంచారు. దాంతో అక్కడ పార్కింగ్‌ సమస్య తలెత్తుతోంది. వచ్చే నెలలో జీ-20 మెగా సదస్సు జరగనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే విమానాల సంఖ్యను తగ్గించాలని సూచించారు. జీ-20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చే వీవీఐపీల విమానాలకు వాటి ప్రదేశంలో చోటు కల్పించనున్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు