Anand Mahindra: ఈ సాంకేతికత మన దగ్గర ఉంటే.. నంబర్‌ వన్‌ అవుతామేమో..!

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా నెట్టింట్లో స్ఫూర్తి నింపే మాటలు చెప్తుంటారు. చమత్కారంగా స్పందిస్తుంటారు.

Published : 08 Apr 2022 01:51 IST

కేంద్రమంత్రిని ట్యాగ్‌ చేసి, వీడియో షేర్ చేసిన మహీంద్రా

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా నెట్టింట్లో స్ఫూర్తి నింపేలా తన అభిప్రాయాలను వెల్లడిస్తారు. చమత్కారంగా స్పందిస్తుంటారు. అలాగే విలువైన సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ఆయన తాజాగా ఓ కొత్త సాంకేతికతను పరిచయం చేశారు. కేంద్రం కూడా ఒకసారి దీనిని పరిగణనలోకి తీసుకోవాలంటూ వీడియోను షేర్ చేశారు.

ఆ వీడియోలో రోడ్డుకు నడి మధ్యలో విండ్‌ టర్బైన్ ఉంటుంది. అటుగా వాహనాలు వెళ్తుండటంతో వచ్చే గాలికి ఆ టర్బైన్ తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతున్న టర్బైన్ నుంచి శక్తి వెలువడుతుంది. టర్కీ అభివృద్ధి చేసిన ఈ సరికొత్త సాంకేతికత ద్వారా గంటకు ఒక కిలో వాట్‌ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంతేగాకుండా ఆ పరికరం గాలిలోని కార్బన్‌ డై ఆక్సైడ్ స్థాయులను కొలుస్తుంది. ట్రాఫిక్ నిర్వహణ, భూకంపాలను గుర్తించే వెలుసుబాట్లు దీనిలో ఉన్నాయి. ఇది మహీంద్రా దృష్టికి చేరడంతో ట్విటర్‌లో షేర్ చేశారు. 

‘సృజనాత్మకత ఉట్టిపడుతోన్న ఈ విండ్ టర్బైన్‌ను ఇస్తాంబుల్ టెక్నికల్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. వాహనాల రాకపోకల కారణంగా వీచే గాలిని ఉపయోగించుకుంటుంది. ఇదే మన ట్రాఫిక్ విషయానికొస్తే.. విండ్ ఎనర్జీలో ప్రపంచ శక్తిగా మారతాం! మన హైవేలపై వాటిని ఏర్పాటు చేయడం గురించి పరిశీలించాలి’ అంటూ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని ట్యాగ్ చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని