Lithium: రాజస్థాన్‌లో భారీగా లిథియం నిక్షేపాలు.. JK కంటే అధికం!

lithium reserves in Rajasthan: రాజస్థాన్‌లో భారీగా లిథియం నిల్వలను అధికారులు తాజాగా గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లో గుర్తించిన నిల్వల కంటే ఇవి అధికం.

Updated : 08 May 2023 16:56 IST

జైపుర్‌: దేశంలో మరోసారి భారీగా లిథియం నిక్షేపాలు (lithium reserves) వెలుగు చూశాయి. రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లా డెగానా మున్సిపాలిటీ పరిధిలో ఈ నిల్వలను గుర్తించినట్లు రాజస్థాన్‌ ప్రభుత్వ అధికారులు, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (GSI)కు చెందిన అధికార వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో గుర్తించిన 59 లక్షల టన్నుల లిథియం నిల్వల కంటే ఇక్కడ అధికంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. 80 శాతం వరకు దేశీయ అవసరాలను ఈ నిల్వలు తీర్చగలవని అంటున్నారు.
Also Read: లిథియం...ఇప్పుడిదే బంగారం!

జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో సలాల్‌ హైమాన ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో భారీగా లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించింది. మొత్తం 59 లక్షల టన్నుల రిజర్వులు వెలుగు చూసినట్లు తెలిపింది. విద్యుత్‌ వాహనాల్లో వినియోగించే బ్యాటరీలకు లిథియం ఎంతో కీలకం. ఈ విషయంలో భారత్‌ ప్రస్తుతం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. మొత్తం లిథియం ఎగుమతుల్లో ఒక్క ఆస్ట్రేలియానే 47 శాతం వాటా కలిగి ఉండగా.. చిలీ 30, చైనా 15 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం లిథియంలో 58 శాతం ఒక్క చైనాలోనే ప్రాసెస్‌ అవుతోంది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో వెలుగుచూసిన లిథియం నిల్వలను ఈ ఏడాది చివరి నాటికి వేలం వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read: లిథియం వెలికితీత... సమస్యాత్మకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని