Metro Rails: మెట్రో రైళ్లలో నిత్యం ‘కోటి’ మంది ప్రయాణం: కేంద్రం

దేశవ్యాప్తంగా 20 నగరాల్లో 895 కి.మీ మేర మెట్రో రైలు వ్యవస్థ అందుబాటులో ఉందని.. నిత్యం వీటిలో కోటి మంది ప్రయాణం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Published : 27 Oct 2023 22:21 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో మెట్రో రైళ్లు (Metro Rails) అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సేవలు అందిస్తోన్న మెట్రోల్లో నిత్యం దేశవ్యాప్తంగా కోటి మంది ప్రయాణం చేస్తున్నారని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి వెల్లడించారు. దిల్లీలో ప్రారంభమైన 16వ అర్బన్‌ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం దేశంలో 20 నగరాల్లో మెట్రో సేవలు అందుతున్నాయన్నారు.

23 ఏళ్లయినా.. ఆ ‘తొమ్మిది’ కమలానికి అందని ద్రాక్షే!

‘దేశవ్యాప్తంగా 20 నగరాల్లో 895 కి.మీ మేర మెట్రో వ్యవస్థ అందుబాటులో ఉంది. నిత్యం కోటి మంది ఇందులో ప్రయాణిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరగనుంది. కొన్ని రోజుల్లోనే ప్రపంచంలో అతిపెద్ద మెట్రో వ్యవస్థల్లో రెండో స్థానం దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది’ అని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ మెట్రో వ్యవస్థల ప్రతినిధులు, రవాణాశాఖ అధికారులు, ముఖ్యనేతలు, అంతర్జాతీయ నిపుణులు, గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా 169 నగరాల్లో 10వేల ఎలక్ట్రిక్‌ బస్సుల్ని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘పీఎం ఈ-బస్‌ సేవ’ (PM-ebus Sewa) పథకంలో భాగంగా తొలుత 3వేల బస్సుల్ని సేకరించేందుకు వచ్చే వారంలోనే టెండర్లు పిలవనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని