Budget Session: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు 31 నుంచి.. రెండు విడతల్లో నిర్వహణ

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మొదటి విడత సమావేశాలు ఫిబ్రవరి 11 వరకు కొనసాగనున్నాయి...

Updated : 14 Jan 2022 13:57 IST

దిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ (2022-23)ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల తొలి విడత ఫిబ్రవరి 11 వరకు కొనసాగనున్నాయి. దాదాపు నెల రోజుల విరామం తర్వాత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత జరగనుంది. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ అదనపు సెక్రటరీ జనరల్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు పెరుగుతోన్న తరుణంలో ఈ సమావేశాలు ప్రారంభం కానుండటంతో.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇటీవల పార్లమెంటులో కరోనా కలకలం రేగిన విషయం తెలిసిందే. 400 మందికిపైగా సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ తీరుపై రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాలు ఇటీవల అధికారులతో సమీక్షించారు. ఓం బిర్లా.. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌ను తనిఖీ చేశారు. 60ఏళ్లు పైబడిన ఎంపీల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో పరీక్షల నిర్వహణ, టీకాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సమావేశాలు సాఫీగా సాగేలా పార్లమెంటు అన్ని ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని