Droupadi murmu: సుపరిపాలన అంటే రామరాజ్యమే: రాష్ట్రపతి

శ్రీరాముడు.. సాహసం, కరుణ, కర్తవ్య నిష్ఠకు ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోదీకి ఆమె లేఖ రాశారు.

Published : 21 Jan 2024 22:53 IST

దిల్లీ: శ్రీరాముడు.. సాహసం, కరుణ, కర్తవ్య నిష్ఠకు ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi murmu) అన్నారు. అయోధ్యలో సోమవారం రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని ప్రధాని మోదీకి (PM Modi) రాష్ట్రపతి లేఖ రాశారు. 11 రోజులుగా ఎంతో నిష్ఠగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ‘‘మన సంస్కృతి, ఆధ్యాత్మికత, రాముడు జీవితంతో ముడిపడి ఉంది. సుపరిపాలన అంటే ఇప్పటికీ రామరాజ్యమే గుర్తొస్తుంది. సత్యనిష్ఠ గొప్పతనాన్ని రాముడి వల్లే గ్రహించానని గాంధీ అన్నారు. జాతి నిర్మాతలకు రామాయణం ప్రేరణగా నిలిచింది. ఇప్పుడు అయోధ్య కార్యక్రమంతో దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది’’ అని లేఖలో పేర్కొన్నారు. పీఎం జన్‌మన్‌ ద్వారా గిరిజనుల అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేసిన సంగతిని ముర్ము తన లేఖలో ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని