రాహుల్‌ గాంధీకి కరోనా పాజిటివ్‌ 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనబడటంతో పరీక్షలు చేయించుకోగా......

Updated : 20 Apr 2021 15:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్‌ చేశారు. ‘‘నాలో స్వల్ప లక్షణాలు కనిపించడంతో  కొవిడ్‌ పరీక్ష చేయించుకోగా.. పాజిటీవ్‌గా తేలింది. నాతో ఇటీవల సన్నిహితంగా మెలిగిన వారు జాగ్రత్తలు తీసుకోండి’’ అని ఆయన ట్విట్లో పేర్కొన్నారు. దేశంలో కొవిడ్‌ టీకాల పంపిణీపై రాహుల్‌ మూడు గంటల క్రితమే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో కీలక నేత ఆనంద్‌ శర్మ కూడా కొవిడ్‌ బారిన పడ్డారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రికి తరలించారు. 

ఇటీవల దేశంలో పలువురు అగ్రనేతలకు కొవిడ్‌ సోకింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తదితరులు నిన్న పాజిటీవ్‌గా తేలారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని