Saudi Arabia: ఆ దేశాలకు వెళితే మూడేళ్ల నిషేధం..!

కొవిడ్‌ కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరులకు కొత్త ఆంక్షలు విధించింది. రెడ్‌ లిస్ట్‌ పేరుతో రూపొందించిన జాబితాలోని దేశాలకు

Updated : 17 Oct 2022 14:48 IST

దుబాయ్‌: కొవిడ్‌ కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరులకు కొత్త ఆంక్షలు విధించింది. రెడ్‌ లిస్ట్‌ పేరుతో రూపొందించిన జాబితాలోని దేశాలకు వెళ్లిన వారికి భారీ జరిమానాలు సహా విదేశాలకు వెళ్లకుండా మూడేళ్లపాటు నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. నిషేధిత దేశాలకు వెళ్లడం కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించడమేనని అక్కడి సర్కారు స్పష్టం చేసింది. అయితే ఆ జాబితాలో భారత్‌ కూడా ఉండటం గమనార్హం. అందులో యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్‌, యెమెన్‌, ఇరాన్‌, టర్కీ, అర్మేనియా, ఇథియోపియా, సొమాలియా, కాంగో, అఫ్గానిస్థాన్‌, వెనిజులా, బెలారస్‌, వియత్నాం దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకు నేరుగా కానీ, ఇతర దేశాల నుంచి కానీ వెళ్లినా ఆంక్షలను ఉల్లంఘించినట్లేనని ప్రభుత్వం పేర్కొంది. ఆ దేశాల్లో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో వాటిని రెడ్‌ లిస్ట్‌లో చేర్చినట్లు సౌదీ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  అధికారిక గణాంకాల ప్రకారం మంగళవారంనాటికి సౌదీలో 5,20,774 కరోనా కేసులు, 8,189 మరణాలు నమోదయ్యాయి. అక్కడ ప్రస్తుతం 11, 136 క్రియాశీల కేసులున్నాయి. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని