Dalai Lama: బుద్ధగయలో దలైలామా.. ‘చైనా మహిళ’ అనుమానాస్పద కదలికలు
బుద్ధ గయలో దలైలామా (Dalai Lama) పర్యటన సందర్భంగా ఓ చైనా మహిళ అనుమానాస్పద కదలికలు కలవరం రేపాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమె కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ మహిళ స్కెచ్‌తోపాటు పాస్‌పోర్టు, వీసా వివరాలను విడుదల చేశారు.
బుద్ధగయ: టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా (Dalai Lama) బిహార్‌లో పర్యటిస్తున్నారు. ఇక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన బుద్ధగయకు చేరుకున్న ఆయన.. మూడురోజుల పాటు కొనసాగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే ఓ చైనా (China) మహిళ అనుమానాస్పద కదలికలు కలకలం రేపాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆమె పేరు సాంగ్ షియావోలాన్ అని పేర్కొన్న పోలీసులు.. ఆమె స్కెచ్ ఫొటోతో పాటు పాస్‌పోర్టు, వీసా వివరాలను విడుదల చేశారు. అయితే, ఎందుకు ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారనే విషయంపై స్పష్టత లేనప్పటికీ.. బౌద్ధ గురువు దలైలామా(Dalai Lama)కు హాని తలపెట్టేందుకు ఆమె పన్నాగం పన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వార్షిక పర్యటనలో భాగంగా బిహార్‌లోని బుద్ధగయ ఆలయానికి దలైలామా డిసెంబర్ 22నే చేరుకున్నారు. కొవిడ్ విజృంభణ కారణంగా రెండేళ్ల తర్వాత గయలో పర్యటిస్తుండడంతో భారీ ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశ విదేశాలనుంచి దాదాపు 50,000 మంది బౌద్ధ సన్యాసులు వచ్చినట్లు అంచనా. తొలిరోజు కార్యక్రమంలో ప్రసంగించిన దలైలామా.. మనమంతా మనుషులుగా జన్మించామని, తాను ఎక్కడున్నా మానవత్వం కోసం పనిచేస్తూనే ఉంటానని అన్నారు.
ఇదిలాఉంటే, కొన్నేళ్లుగా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న దలైలామా.. చాలా సందర్భాల్లో చైనా నాయకత్వాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. భిన్న సంప్రదాయాల ప్రాముఖ్యతను వారు అర్థం చేసుకోలేరన్న ఆయన.. ముఖ్యంగా అక్కడ హాన్‌వర్గం ఆధిపత్యం, నియంత్రణే ఎక్కువ ఉంటుందని చెప్పారు. అయితే, తోటి వ్యక్తిగా తనకు చైనా ప్రజలపై ఎటువంటి వ్యతిరేకత లేదని పేర్కొన్నారు. తాను భారత్‌లోనే ఉంటానని, ఇక్కడే ప్రశాంతంగా ఉందని దలైలామా పలుసార్లు వెల్లడించారు. అందుకే ఆయనపై చైనా గుర్రుగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Whatsapp: ఈ ఫోన్లలో త్వరలో వాట్సప్ బంద్.. లిస్ట్ ఇదిగో..
-
Ukraine: ఒడెస్సా పోర్టులో రష్యా భారీ విధ్వంసం..!
-
RDX Movie Review: రివ్యూ: ఆర్డీఎక్స్.. మలయాళంలో రూ.80 కోట్లు వసూలు చేసిన మూవీ ఓటీటీలో వచ్చేసింది!
-
Chandrababu Arrest: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా
-
Andhra news: గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుబట్టిన కాగ్
-
Monsoon: నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభం: ఐఎండీ