Sputnik Light: సమర్థత ఎంత?

8.6శాతం నుంచి 83.7శాతం సమర్థతతో ఈ వ్యాక్సిన్‌ పనిచేస్తున్నట్లు ఆర్‌డీఐఎఫ్‌ తెలిపింది.

Published : 03 Jun 2021 16:17 IST

న్యూదిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణకు ఇప్పటికే పలు టీకాలు అందుబాటులోకి వచ్చినా, ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు మనిషి శరీరంలో సమర్థంగా పనిచేయాలంటే నిర్ణీత కాలావధిలో రెండుసార్లు తీసుకోవాలి. అయితే, రష్యాకు చెందిన రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) తయారు చేస్తున్న స్పుత్నిక్‌లైట్‌ మాత్రం ఒక్క డోస్‌ తీసుకుంటే చాలని చెబుతోంది. మరి ఒక్క డోస్‌ సామర్థ్యం ఎంత? 78.6శాతం నుంచి 83.7శాతం సమర్థతతో ఈ వ్యాక్సిన్‌ పనిచేస్తున్నట్లు ఆర్‌డీఐఎఫ్‌ తెలిపింది. అర్జెంటీనాలో ప్రయోగాత్మకంగా కొంతమందికి ఈ వ్యాక్సిన్‌ ఇచ్చి పరీక్షించారు.

బ్యూనోస్‌ ఏరియస్‌ ప్రావిన్స్‌(అర్జెంటీనా) ఆరోగ్య మంత్రిత్వశాఖ సేకరించిన గణాంకాల ప్రకారం 60-79 సంవత్సరాల వయసు కలిగిన 1.86లక్షల మందికి స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఇందులో 40వేల మంది స్పుత్నిక్‌లైట్‌ ఒక డోస్‌ మాత్రమే తీసుకున్నారు. స్పుత్నిక్‌ ఒక డోస్‌ తీసుకున్న వారిలో ఇన్‌ఫెక్షన్‌ రేటు 0.44శాతంగా ఉండగా, అసలు వ్యాక్సిన్‌ తీసుకోని వారిలో ఇన్‌ఫెక్షన్‌ రేటు 2.74శాతంగా ఉంది. ఇదే ఫార్ములా ఉపయోగించి వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని నిర్ధారించారు. స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారిలో వ్యాక్సిన్‌ సామర్థ్యం 78.6శాతంగా ఉండగా, స్పుత్నిక్‌లైట్‌ తీసుకున్న కొందరిలో ఏకంగా  83.7శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు గుర్తించారు.  స్పుత్నిక్‌లైట్‌ కూడా ప్రభావవంతంగా పనిచేస్తోందని ఆర్‌డీఐఎఫ్‌ సీఈవో కిరిల్‌ దిమిత్రివ్‌ తెలిపారు. సగటున 79.4శాతం సామర్థ్యంతో స్పుత్నిక్‌ లైట్‌ పనిచేస్తున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని