Afghan crisis: అఫ్గాన్‌ పరిస్థితి క్లిష్టంగా ఉంది..సాధ్యమైనంత ఎక్కువమందిని తరలిస్తాం

అఫ్గానిస్థాన్ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని, అక్కడి నుంచి సాధ్యమైనంత ఎక్కువమందిని తరలించడానికి భారత్‌ ప్రయత్నిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. అఫ్గాన్ పరిణామాలపై కేంద్రం గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మంత్రి అక్కడి పరిస్థితులను సభ్యులకు వివరించారు.

Published : 26 Aug 2021 16:05 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని, అక్కడి నుంచి సాధ్యమైనంత ఎక్కువమందిని తరలించడానికి భారత్‌ ప్రయత్నిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. అఫ్గాన్ పరిణామాలపై కేంద్రం గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మంత్రి అక్కడి పరిస్థితులను సభ్యులకు వివరించారు. 

‘అఫ్గాన్‌లో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి. శాంతి ఒప్పందానికి సంబంధించి దోహాలో తాలిబన్లు ఇచ్చిన మాటను ఇంకా నిలబెట్టుకోలేదు. ప్రస్తుతానికి భారత్ అక్కడి పరిస్థితుల్ని గమనిస్తోంది. అలాగే సాధ్యమైనంత ఎక్కువ మందిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ రోజు 35 మందిని వెనక్కి తీసుకువచ్చాం’ అని జైశంకర్ వెల్లడించారు. అలాగే అఫ్గాన్ సంక్షోభంపై ప్రభుత్వ వైఖరి, తరలింపు ప్రక్రియను విపక్షాలు అభినందించాయి. 

తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించిన నాటి నుంచి భారత్‌ ఇప్పటివరకు సుమారు 800 మందిని తరలించింది. అలాగే అఫ్గాన్‌ నుంచి బయటపడేందుకు తమకు సహకరించాలని సుమారు 15వేల మంది సంప్రదించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. అఫ్గాన్‌లో శాంతిని నెలకొల్పే లక్ష్యంతో 2020 ఫిబ్రవరిలో యూఎస్‌, తాలిబన్లు దోహాలో ఒక ఒప్పందంపై సంతకం చేశారు. తాలిబన్లు ఈ ఒప్పందానికి మద్దతుఇస్తే.. 14 నెలలులోగా అన్ని దళాలను ఉపసంహరించుకునేందుకు అమెరికా, నాటో మిత్రదేశాలు అంగీకరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని