Joe Biden: ఆస్ట్రేలియా ప్రధాని పేరు మర్చిపోయిన బైడెన్‌..!

చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో యూఎస్‌, బ్రిటన్, ఆస్ట్రేలియా మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. దానిలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రధానులు బోరిస్‌ జాన్సన్‌, స్కాట్ మోరిసన్ మధ్య వర్చువల్ సమావేశం జరిగింది. ఆ సమయంలో మాట్లాడిన బైడెన్ ఆస్ట్రేలియా ప్రధాని పేరు మర్చిపోయారు. తమ ప్రధాని పేరు మర్చిపోవడంతో ఈ విషయం అక్కడి ప్రజలు, మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

Updated : 16 Sep 2021 12:29 IST

వాషింగ్టన్‌: చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో యూఎస్‌, బ్రిటన్, ఆస్ట్రేలియా మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. దానిలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రధానులు బోరిస్‌ జాన్సన్‌, స్కాట్ మోరిసన్ మధ్య వర్చువల్ సమావేశం జరిగింది. ఆ సమయంలో మాట్లాడిన బైడెన్.. ఆస్ట్రేలియా ప్రధాని పేరు మర్చిపోయారు. తమ ప్రధాని పేరు మర్చిపోవడంతో అక్కడి ప్రజలు, మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

చైనాకు చెక్‌ పెట్టేందుకు ఈ మూడు దేశాలు కలిసి AUKUS కూటమిగా ఏర్పడ్డాయి. దీని కింద అణు జలాంతర్గాములను సమకూర్చుకునేందుకు ఆస్ట్రేలియాకు అమెరికా, బ్రిటన్ సహకరించనున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ.. మొదట యూకే ప్రధాని బోరిస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని వైపు తిరిగి సహచరుడు అని అర్థం వచ్చేలా సంబోధించి, కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ సమయంలో మోరిసన్ పేరు మర్చిపోయినట్లు కనిపించింది. అయితే, తర్వాత కొనసాగించిన ఉపన్యాసంలో మాత్రం ప్రధాని పేరును ప్రస్తావించారు. 

ఆయన సంబోధించిన #ThatFellaDownUnder అనే పదం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై ఆస్ట్రేలియా మీడియా భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. కొన్ని సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఓ సంస్థ మాత్రం దీనివల్ల అసలు ఉద్దేశం మరుగునపడదని వ్యాఖ్యానించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని