Vaccine for children: పిల్లలకు టీకాలు ఇప్పుడే కాదు: NTAGI

నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (NTAGI) పిల్లలకు టీకాల విషయంపై స్పష్టతనిచ్చింది. ఈ ఏడాదిలో పిల్లలకు టీకాలు ఇవ్వమని తెలిపింది......

Published : 07 Dec 2021 20:49 IST

దిల్లీ: కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దాదాపు 35 దేశాల్లో కేసులు వెలుగుచూశాయి. భారత్‌లోనూ పదుల సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో బూస్టర్‌ డోసులు, పిల్లలకు టీకాలు ఇవ్వాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (NTAGI) పిల్లలకు టీకాల విషయంపై స్పష్టతనిచ్చింది. ఈ ఏడాదిలో పిల్లలకు టీకాలు ఇవ్వమని తెలిపింది. వారికి ఎప్పుడు ఇవ్వాలో వచ్చే ఏడాదే నిర్ణయిస్తామని వెల్లడించింది. అదనపు డోసులు, పిల్లలకు వ్యాక్సిన్లపై ఈ భేటీ కొనసాగింది. కాగా పిల్లలకు టీకాల విషయంపై ప్రభుత్వాని ఇప్పటివరకు ఎలాంటి సిఫార్సులు చేయలేదని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ అధికారులు వెల్లడించారు.

పిల్లలకు టీకాల విషయంపై నిపుణుల సూచన మేరకే నిర్ణయం తీసుకుంటామని కొద్దిరోజుల క్రితమే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ పార్లమెంట్​ వేదికగా తెలిపారు. ఈ నేపథ్యంలోనే నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ స్పందించడం గమనార్హం. కరోనా మహమ్మారిపై లోక్​సభలో గత శుక్రవారం సుదీర్ఘ చర్చ సాగింది. ఈ నేపథ్యంలోనే మాండవీయ మాట్లాడుతూ.. బూస్టర్​ డోసు సహా పిల్లలకు కొవిడ్​ టీకాపై నిపుణుల సూచనల మేరకే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కరోనాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి వెల్లడించారు. కొవిడ్‌పై దేశం చేస్తున్న పోరాటాన్ని నీరుగార్చేందుకు విపక్షాలు యత్నిస్తున్నాయంటూ మండిపడ్డారు.

 

Read latest National - International News and Telugu News

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని