Parliament: పార్లమెంట్‌లో మళ్లీ అదే రగడ

ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారం, సాగు చట్టాలపై విపక్షాల నిరసనల మధ్య పార్లమెంట్‌ ఉభయ సభల్లో బుధవారం కూడా వాయిదా పర్వం మొదలైంది. ఈ ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే

Updated : 28 Jul 2021 13:39 IST

విపక్షాల నిరసన.. రాజ్యసభ వాయిదా

దిల్లీ: ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారం, సాగు చట్టాలపై విపక్షాల నిరసనల మధ్య పార్లమెంట్‌ ఉభయ సభల్లో బుధవారం కూడా వాయిదా పర్వం మొదలైంది. ఈ ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగట్టిగా నినాదాలు చేశారు. వారి నిరసనల మధ్యే స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల గంట చేపట్టారు. అయినప్పటికీ పట్టు సడలించిన విపక్షాలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. విపక్ష ఎంపీల ఆందోళనల నడుమే ప్రశ్నోత్తరాల గంట కొనసాగుతోంది. 

అటు రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు గళమెత్తారు. పెగాసస్‌ స్పైవేర్‌ను అక్రమంగా వాడడంపై నిరసనలు తెలిపారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. దీంతో అసహనానికి గురైన ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని