Shashi Tharoor: ఉయ్యాల ఊగుతున్న ఈ ఎంపీని చూశారా?

మలయాళీలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ ఓనం. ఆగస్టు 21 (శనివారం) నుంచి  పదిరోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. ఆరోజు.. అమ్మాయిలు సంప్రదాయ దుస్తులు ధరించి ఊయల ఊగుడమనేది అనతికాలంగా వస్తున్న సంస్కృతి. పండుగను పురస్కరించుకుని కేరళ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ ఎర్రచొక్కా, పంచె, కండువా ధరించి..

Published : 21 Aug 2021 18:50 IST

కేరళలో ఘనంగా ఓనం వేడుకలు

తిరువనంతపురం: మలయాళీలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ ఓనం. ఆగస్టు 21 (శనివారం) నుంచి  పదిరోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆరోజు.. అమ్మాయిలు సంప్రదాయ దుస్తులు ధరించి ఊయల ఊగడమనేది ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. పండుగను పురస్కరించుకుని కేరళ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ ఎర్రచొక్కా, పంచె, కండువా ధరించి.. అదే తరహాలో ఉయ్యాల ఊగుతూ సందడి చేశారు. ఇటీవల ఓ మలయాళ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన బాల్యంలో ఓనం పండుగ ఎలా జరుపుకొనేవారు, చిన్ననాటి ముచ్చట్లతో పాటు 2010 ఆగస్టులో తన భార్య సునందా పుష్కర్‌ను కేరళలోని పాలక్కడ్‌లోని పూర్వీకుల ఇంట్లోనే పెళ్లిచేసుకున్నాని చెప్పుకొచ్చారు

ఓనం పండుగ సంగతులు
కేరళలో పదిరోజుల పాటు నిర్వహించే ఈ పండుగలో మొదటి మూడు రోజులు (ఆగస్టు 21-23) కీలకం. మలయాళ పంచాంగం ప్రకారం.. ‘చింగం’ ( మలయాళం క్యాలెండర్‌లోని తొలి నెల) నెలలో తిరుఓనం నాడు ఓనం వస్తుంది. ఓనం సందర్భంగా ప్రజలు వారి ఇంటి ముందు రంగురంగుల పూలతో ముగ్గు వేసి ఆ మధ్యలో దీపం వెలిగిస్తారు. దీన్ని పూక్కలం అంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు రకరకాల పువ్వులను సేకరించి వాటితో ఇంటి ముందు అందమైన ముగ్గు వేస్తారు. 

కేరళలో ఎక్కడ చూసినా.. ఏనుగుల స్వారీలు, తెల్లటి దుస్తుల్లో మగువలు, రకరకాల పూలతో సుందరంగా చేసిన అలంకరణలు కనువిందుచేస్తాయి. రంగవల్లులపై ఓనం రోజున పోటీలు కూడా నిర్వహిస్తారు. ఈ పండుగ రోజున మలయాళీలు నిర్వహించే ఓనసద్యా అనే విందు ప్రసిద్ధి. దీన్ని అరటి ఆకులపై పలు రకాల ఆహార పదార్థాలు వడ్డిస్తారు. సంప్రదాయ ఊరగాయలు, అప్పడాలు, పాయసంతోపాటు రకరకాల పిండి వంటలు చేసుకుంటారు.

 


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని