Zika virus: కేరళలో జికా వైరస్‌ కలకలం..!

ఓ వైపు కరోనా వైరస్‌ మహమ్మారితో దేశం సతమవుతుండగా.. కేరళలో తొలిసారి జికా వైరస్‌ కేసులు వెలుగుచూడడం కలకలం రేపుతోంది. తిరువనంతపురం జిల్లాలో 13 జికా....

Published : 08 Jul 2021 20:46 IST

తిరువనంతపురం: ఓ వైపు కరోనా వైరస్‌ మహమ్మారితో దేశం సతమవుతుండగా.. కేరళలో తొలిసారి జికా వైరస్‌ కేసులు వెలుగుచూడడం కలకలం రేపుతోంది. తిరువనంతపురం జిల్లాలో 13 జికా వైరస్‌ కేసులు తాజాగా నమోదయ్యాయి. పుణెలోని నేషనల్‌ వైరాలజీ ల్యాబ్‌కు 19 శాంపిళ్లను పంపించగా.. 12 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అంతకుముందు 24 ఏళ్ల గర్భిణిలో ఈ వైరస్‌ తొలిసారి వెలుగు చూసింది. ఈ నెల 7న ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది కూడా. బిడ్డలో వైరస్‌ లక్షణాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

జికా వైరస్‌ ఏడెస్‌ అనే దోమ నుంచి మనుషులకు సోకుతుంది. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ.. ఇప్పటి వరకూ దీనికి మందు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఈ వైరస్‌ సోకితే కొందరిలో జ్వరం, దద్దర్లు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు సోకితే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలుత 1947లో ఉగాండా అడవుల్లో కోతుల్లో ఈ వైరస్ కనిపించింది. 1952లో మనుషుల్లోనూ గుర్తించారు. 2017లో అహ్మదాబాద్‌, తమిళనాడులో ఈ కేసులు వెలుగుచూశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని