Viral news: వీడెవడ్రా బాబోయ్‌.. పాల డెలివరీకి హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌!

హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌పై వెళ్లి ఓ వ్యక్తి పాలు అమ్మాడు. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయండంతో వైరల్‌గా మారింది.

Published : 07 Jan 2023 01:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిన తర్వాత ఆసక్తికరంగా ఉన్న ఏ అంశమైనా వెంటనే వైరల్‌గా మారిపోతోంది. యూజర్లు కూడా అలాంటి వాటినే ఎక్కువగా సెర్చ్‌ చేస్తుంటారు. తాజాగా పాలు అమ్మేందుకు ఓ వ్యక్తి ప్రీమియం బైక్‌ హార్లే డేవిడ్‌సన్‌ను ఉపయోగించడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా పాలు అమ్మేవాళ్లు.. ఏదో చిన్నపాటి ద్విచక్రవాహనాన్ని పాల క్యాన్లు తగిలించుకునేందు వీలుగా మార్చి.. ఇంటింటికీ వచ్చి పాలు పోసి వెళ్తుంటారు. కానీ, ఈ వ్యక్తి మాత్రం బైకు వెనక రెండు పాల క్యాన్లు పెట్టుకొని వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ, దీనికి సంబంధించిన వీడియోను అమిత్‌ బదనా అనే వ్యక్తి ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తున్నాయి. పాలు అమ్మడానికి హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌పై వెళ్లడంలో వింతేముంది అనుకుంటున్నారా? దీని విలువ రూ.11లక్షలకు పైగానే ఉంటుందండీ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని