Covid compensation: ‘ఏది నిజం’.. భాజపా ప్రభుత్వంపై శశి థరూర్‌ విమర్శలు

అధికార భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ సంబంధిత మరణాల అధికారిక గణాంకాలకు......

Published : 02 Apr 2022 01:41 IST

దిల్లీ: అధికార భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ విమర్శలు గుప్పించారు. కరోనా సంబంధిత మరణాల అధికారిక గణాంకాలకు, ఆర్థిక పరిహారం కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య మధ్య వ్యత్యాసాలపై ప్రభుత్వంపై మండిపడ్డారు. మరణాలను దాచిపెట్టినట్లు ఆరోపించారు. లోక్‌సభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా కొవిడ్‌పై ఐసీఎంఆర్‌ పరిశోధనపై చర్చించినట్లు థరూర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలోనే భాజపా అధికారంలో ఉన్న గుజరాత్‌ సర్కారు ఎండగట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ గణాంకాల్లో రాష్ట్రంలోని కరోనా మరణాలు 10,094గానే ఉన్నాయని, కానీ దాదాపు 70వేల పరిహారం దరఖాస్తులు వచ్చాయని పేర్కొంటూ.. ఏది నిజం అని ప్రశ్నించారు.

‘ఈరోజు లోక్‌సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఐసీఎంఆర్‌ చేపట్టిన కరోనా పరిశోధనలపై చర్చించాం. కొవిడ్ మరణాల అధికారిక గణాంకాలు, ఎక్స్‌గ్రేషియా చెల్లింపులను క్లెయిమ్ చేసే సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని ఎవరూ లేవనెత్తలేదు. ఉదా. గుజరాత్‌ రాష్ట్రంలో 10,094 కరోనా మరణాలే సంభవించాయని ప్రభుత్వం పేర్కొంటోంది.. కానీ 68,370 నష్టపరిహారం దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఏది నిజం?’ అని ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని