ఐఫోన్‌లో నోకియా డిస్‌ప్లే..ఎలానో తెలుసా..?

నోకియా తొలి తరం ఫోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. మొబైల్‌ వినియోగం మొదలైన తొలినాళ్లలో ప్రతి ఒక్కరి ఎంపిక నోకియా ఫీచర్‌ ఫోన్లే. ఇప్పటి ఫోన్లలా వాటిలో స్మార్ట్‌ ఫీచర్లు లేకపోయినా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వాటిలో...

Published : 12 Oct 2020 18:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నోకియా తొలి తరం ఫోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. మొబైల్‌ వినియోగం మొదలైన తొలినాళ్లలో ప్రతి ఒక్కరి ఎంపిక నోకియా ఫీచర్‌ ఫోన్లే. ఇప్పటి ఫోన్లలా వాటిలో స్మార్ట్‌ ఫీచర్లు లేకపోయినా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వాటిలో ఉండే స్నేక్, క్యారమ్స్‌ గేమ్‌లను విపరీతంగా ఆడేవారు. తర్వాత కలర్‌ డిస్‌ప్లే, కీపాడ్ లేకుండా టచ్‌ స్క్రీన్‌ ఫోన్లు సందడి చేశాయి. టెక్నాలజీలో చోటుచేసుకున్న మార్పులతో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. తర్వాత ఫీచర్‌ ఫోన్ల వినియోగం తగ్గడంతో పాటు వాటి తయారీ కూడా ఆగిపోయింది.

తాజాగా నోకియా ఫీచర్‌ ఫోన్లను ఇష్టపడే వారి కోసం రెట్రో విడ్జెట్ పేరుతో ఐఓఎస్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. యాపిల్ యూజర్స్‌ ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేకుంటే నోకియా ఫీచర్‌ ఫోన్ డిస్‌ప్లేను పోలిన క్లాసిక్‌, పిక్సెలేటెడ్ లుక్‌తో విడ్జెట్‌ మీ ఐఫోన్‌/ఐపాడ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ విడ్జెట్‌లో సిగ్నల్‌, నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ నేమ్‌ కనిపిస్తాయి. నోకియా ఫీచర్‌ ఫోన్‌ అంటే ఇష్టపడేవారు, తమ ఫోన్‌ స్క్రీన్‌ విభిన్నంగా ఉండాలని కోరుకునే వారు ఈ యాప్‌ను ప్రయత్నించవచ్చు. 4.5ఎంబీ సైజ్‌ ఉన్న యాప్‌ ధర రూ. 159. ఇటీవల విడుదల చేసిన ఐఓఎస్‌ 14లో యాపిల్ యూజర్స్‌కి హోం స్క్రీన్‌లో నచ్చినట్లుగా మార్పులు చేసుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని