Updated : 07 Dec 2021 06:04 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07-12-2021)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

తలపెట్టిన పనులలో విఘ్నాలు ఎదురవుతాయి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. వివాదాల్లో తలదూర్చకండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం శ్రేయోదాయకం.

మిశ్రమ కాలం. పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

ప్రయత్నకార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతవరణం ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం. 

మధ్యమ ఫలితాలున్నాయి. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి.  ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.  

శుభకాలం. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి.   కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని సందర్శిస్తే మంచిది. 

చేపట్టిన పనులను చక్కటి ప్రణాళికతో పూర్తిచేస్తారు. అవసరానికి సాయం చేసేవారున్నారు. శుభ సమయం. బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచింది.  

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. ఖర్చులు పెర పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుడిని ఆరాధించాలి.

శ్రమ ఫలిస్తుంది. సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. విష్ణు ఆరాధన శుభప్రదం.

అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా నామాన్ని జపించడం ఉత్తమం.

 

మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. గొప్ప ఆలోచనా విధానంతో అభివృద్ధిని సాధిస్తారు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి.

ఒక శుభవార్త వింటారు. ఆర్థికంగా లాభాన్ని గడిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ,  వ్యాపార రంగాల వారు పరిస్థితులు తారుమారు కాకుండా జాగ్రత్త పడడం మంచిది. అష్టలక్ష్మీ దేవి సందర్శనం శుభప్రదం.

గ్రహబలం చాలా తక్కువగా ఉంది. చేపట్టే పనుల్లో జాగ్రత్త అవసరం. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సమయానుకూలంగా నిర్ణయాలను మార్చుకుంటూ ముందుకు సాగాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

 

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని