అందుకే పాస్టర్‌గా మారాల్సి వచ్చింది: రాజా

వెండితెరకు దూరమైన ఎంతో మంది నటీనటులు ఇప్పుడు ఎక్కడున్నారు..? ఎలా ఉన్నారు..? ఏం చేస్తున్నారు..? ఇలాంటివి తెలుసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది ‘ఆలీతో సరదాగా’. వారి జీవిత విశేషాలను, సినీ రంగంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను ప్రేక్షకులకు తెలియజేస్తోందీ ‘ఆలీతో సరదాగా’.

Published : 10 Dec 2020 00:44 IST

హైదరాబాద్‌: వెండితెరకు దూరమైన ఎంతో మంది నటీనటులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వంటివి తెలుసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది ‘ఆలీతో సరదాగా’. వారి జీవిత విశేషాలను, సినీ రంగంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను ప్రేక్షకులకు తెలియజేస్తోందీ కార్యక్రమం. వారం వారం సెలబ్రెటీల మాట-ముచ్చట్లతో ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది. ఆలీ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో తాజాగా కథానాయకుడు రాజా పాల్గొని తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను, బాధలతో పాటు మరెన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

షోలో భాగంగా ‘కథానాయకుడిగా చిత్రాలతో బిజీగా ఉండి ఒక్కసారిగా పాస్టర్ ఎందుకు అయ్యారు?’ అని ఆలీ అడగ్గా.. ‘సినిమాలపై ఆసక్తి కోల్పోయాను. అనుకోకుండా అలా జరిగింది’ అని రాజా చెప్పారు. అలాగే ‘మీరు రిసెప్షనిస్ట్‌గా పని చేశారా?’ అని ప్రశ్నించగా.. ‘అవును, నేను ఇక్కడే గ్రీన్‌ పార్క్‌లో పనిచేశాను’ అని బదులిచ్చారు. ‘చిన్నప్పుడు మీ అమ్మ, నాన్నతో కలిసి చర్చికి వెళ్లేవారా?’ అని ఆలీ అడగ్గా.. ‘అమ్మ నాకు గుర్తులేదు. నేను ఐదేళ్లు ఉన్నప్పుడే మరణించారు. తర్వాత నాన్న 14 ఏళ్లు ఉన్నప్పుడు మరణించారు. నాకు ఆ దేవుడు ఒక అమ్మని తీసుకెళ్లినా.. ఇద్దరు అక్కలను అమ్మలుగా ఇచ్చాడు’ అంటూ రాజా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎవరైనా కుర్రాళ్లు వచ్చి నిన్ను స్ఫూర్తిగా తీసుకొని చిత్ర పరిశ్రమకు వెళ్లాలనుకుంటున్నాను అని అడిగితే మీరేం చెప్తారు?’ అని ఆలీ ప్రశ్నించగా.. ‘వద్దంటాను’ అని ఆయన సమాధానమిచ్చారు. ఇంతకీ ఆయన ఎందుకు వద్దంటున్నారు? రాజా ఆత్మహత్య చేసుకున్నారంటూ వచ్చిన వార్తల వెనుక నిజమెంత? వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే వచ్చే సోమవారం (డిసెంబర్‌ 14)న ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’  చూడాల్సిందే.. అప్పటి వరకు మరీ ఈ ప్రోమోను చూసేయండి..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని