రామలక్ష్మిపై అందరూ అనుమానం వ్యక్తం చేశారు!

అప్పటివరకూ గ్లామర్‌ పాత్రల్లో రాణించిన సమంత మొదటిసారి డీగ్లామర్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమాలో సామ్‌.. రామలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు....

Updated : 28 Dec 2020 17:52 IST

డీగ్లామర్‌ రోల్‌లోనూ మెప్పించిన సామ్‌

హైదరాబాద్‌: అప్పటివరకూ గ్లామర్‌ పాత్రల్లో రాణించిన సమంత మొదటిసారి డీగ్లామర్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమాలో సామ్‌.. రామలక్ష్మి అనే పల్లెటూరి యువతి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. 2018లో విడుదలైన ఈ సినిమా సామ్‌ కెరీర్‌లో ఓ ఆణిముత్యంగా నిలిచింది. అయితే ‘రామలక్ష్మి’ పాత్ర కోసం సమంతను తీసుకోవాలని చిత్రబృందం తొలుత భావించలేదట. సామ్‌ని డీగ్లామర్‌గా చూపిస్తే అభిమానులు ఏమంటారో అని చిత్రబృందంలోని కొంతమంది సభ్యులు అనుమానం వ్యక్తం చేశారట.

‘‘రామలక్ష్మి పాత్ర నాకు ఎంతగానో గుర్తింపు తెచ్చింది. డీగ్లామర్‌ పాత్రలో నేను నటిస్తే ప్రేక్షకులు ఓకే చేస్తారా? అనే అనుమానం చాలామందికి వచ్చింది. ‘ఇప్పటి వరకూ గ్లామర్‌ పాత్రల్లో కనిపించిన సమంతను ఓ పల్లెటూరు అమ్మాయిగా, మొరటుగా.. పూర్తి డీగ్లామర్‌ రోల్‌లో చూపిస్తే అభిమానులు ఏమనుకుంటారో’ అని సుకుమార్‌ డైరెక్షన్‌ టీమ్‌లోని కొంతమంది అసిస్టెంట్‌ డైరెక్టర్లు అనుమానం వ్యక్తం చేశారు. కానీ, సుకుమార్‌ సర్‌ మాత్రం నాపై నమ్మకం ఉంచి ‘రంగస్థలం’లో నాకు అవకాశమిచ్చారు. అలా నాకు రామలక్ష్మి పాత్ర చేసే అవకాశం వరించింది’’ అని ఇటీవల సమంత వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని