ఈ హీరోయిన్‌ ఫాలోయింగ్‌ మామూలుగా లేదు!

కథానాయిక దిశా పటానీ అతి తక్కువ కాలంలో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో వేగంగా 40 మిలియన్ల ఫాలోవర్స్‌ (ఇన్‌స్టాగ్రామ్‌) సాధించిన నటిగా గుర్తింపు పొందారు. ఈ విషయంలో దిశా గత కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న అలియా భట్‌, కత్రినా కైఫ్‌....

Published : 30 Sep 2020 16:47 IST

అతి తక్కువ కాలంలో.. స్టార్స్‌ను బీట్‌ చేసి..

ముంబయి: కథానాయిక దిశా పటానీ అతి తక్కువ కాలంలో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో వేగంగా 40 మిలియన్ల ఫాలోవర్స్‌ (ఇన్‌స్టాగ్రామ్‌) సాధించిన నటిగా గుర్తింపు పొందారు. ఈ విషయంలో దిశా గత కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న అలియా భట్‌, కత్రినా కైఫ్‌, అనుష్క శర్మలను బీట్‌ చేయడం గమనార్హం. దిశా 2016లో ‘ఎమ్‌.ఎస్‌. ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’తో బాలీవుడ్‌కు నటిగా పరిచయం అయ్యారు. ‘భారత్‌’లోని ఓ గీతంలో తన డ్యాన్స్‌, అందంతో ఆకట్టుకున్నారు. ‘మలంగ్‌’లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ బ్యూటీ తరచూ డ్యాన్స్‌, జిమ్‌ వీడియోలను ఫాలోవర్స్‌తో షేర్‌ చేసుకుంటుంటారు. ఆమె ఫిట్‌నెస్‌కు నెటిజన్లు అనేకమార్లు ఫిదా అయ్యారు. పరిశ్రమకు పరిచయమైన దాదాపు నాలుగేళ్లలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 40 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకోవడం విశేషం.

అలియా భట్‌ 2012లో ‘స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్‌’తో అరంగేట్రం చేసి.. అనేక సినిమాలతో అలరించారు. ‘రాజీ’, ‘గల్లీబాయ్‌’ ఘన విజయం సాధించాయి. 2019లో అంటే.. నటిగా పరిచయమైన ఏడేళ్లకు ఆమె ఫాలోవర్స్‌ సంఖ్య 40 మిలియన్లకు చేరింది. మొత్తం ఎనిమిదేళ్లలో (2012-2020) 43 మిలియన్ల ఫాలోవర్స్‌ను సాధించారు. అనుష్క శర్మ 2008లో షారుక్‌ ఖాన్‌ సినిమాతో పరిచయమై.. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. 40 మిలియన్లు చేరుకోవడానికి ఆమెకు 12 ఏళ్లు పట్టింది. 2020 ఆరంభంలో ఆమె ఈ మైలురాయిని అందుకున్నారు. ప్రస్తుతం అనుష్కను 43 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. కత్రినా 2003లో ‘బూమ్‌’ చిత్రంతో నటిగా పరిచయమయ్యారు. హిందీలోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించారు. ఇన్‌స్టాలో 40 మిలియన్‌ ఫాలోవర్స్‌ను చేరడానికి ఆమెకు 15 ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఆమెను 44.2 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని