NBK 107: తొలి అడుగు ఇక్కడే...

బాలకృష్ణ 107వ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి రంగం సిద్ధమైంది. ఈ నెలలోనే చిత్రీకరణని ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణకి

Updated : 09 Feb 2022 06:56 IST

బాలకృష్ణ 107వ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి రంగం సిద్ధమైంది. ఈ నెలలోనే చిత్రీకరణని ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా శ్రుతిహాసన్‌ నటించనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమాలోని సింహ భాగం సన్నివేశాల్ని విదేశాల్లోనూ తెరకెక్కించనున్నట్టు సమాచారం. తొలి సన్నివేశాల్ని మాత్రం తెలంగాణలోని సిరిసిల్లలో తెరకెక్కించాలని చిత్రబృందం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ‘క్రాక్‌’తో విజయాన్ని అందుకున్న గోపీచంద్‌ మలినేని... మరో శక్తివంతమైన కథతో బాలకృష్ణ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని