janhvi kapoor: వీరిద్దరి జీవితం క్రికెట్‌ ఒక్కటే

నచ్చిన జట్టు క్రికెట్‌ ఆటలో విజయం సాధిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేరు కొందరు. ఆ కొందరిలో బాలీవుడ్‌ తారలు జాన్వీ కపూర్‌, రాజ్‌కుమార్‌ రావ్‌లు కూడా ఉన్నారు.

Updated : 09 May 2024 10:05 IST

నచ్చిన జట్టు క్రికెట్‌ ఆటలో విజయం సాధిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేరు కొందరు. ఆ కొందరిలో బాలీవుడ్‌ తారలు జాన్వీ కపూర్‌, రాజ్‌కుమార్‌ రావ్‌లు కూడా ఉన్నారు. ఆ ఆనందం అంతా ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ చిత్రం కోసమే. హారర్‌ కామెడీ చిత్రం ‘రూహీ’ తర్వాత వీరిద్దరూ కలిసి తెరపై సందడి చేయనున్న చిత్రమిది. క్రికెట్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని శరణ్‌ శర్మ తెరకెక్కించారు. అపూర్వ మెహతా, కరణ్‌ జోహార్‌ నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 31న రానుంది. విడుదల సమయం దగ్గర పడుతున్న వేళ ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్లను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది జాన్వీ. ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహిని కలవండి. వారి జీవితమే క్రికెట్‌. క్రికెట్‌ ఒక్కటే వారి జీవితం. క్రికెట్‌ తర్వాత మిస్టర్‌ మహి ప్రేమించేది తన ప్రియమైన భార్యను మాత్రమే’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. క్రికెట్‌ అభిమానుల మధ్యలో జాన్వీ, రాజ్‌ కుమార్‌ ఆనందంలో మునిగితేలుతున్నట్లు ఉన్న ఆ పోస్టర్లు ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. మరి వారిద్దరి క్రికెట్‌ జీవితం తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని