Priyanka chopra: ఇలాంటి కలయికలో మరో చిత్రం రాదేమో!
గత కొంత కాలంగా హిందీ సినిమాలకు దూరంగా ఉన్న అగ్రకథానాయిక ప్రియాంక చోప్రా వరుస హాలీవుడ్ చిత్రాలతో బిజీగా గడుపుతోంది.
గత కొంత కాలంగా హిందీ సినిమాలకు దూరంగా ఉన్న అగ్రకథానాయిక ప్రియాంక చోప్రా వరుస హాలీవుడ్ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇంగ్లిష్ చిత్రం ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇలియా నైషుల్లర్ దర్శకత్వంలో రానున్న యాక్షన్ కామెడీ చిత్రమిది. పీటర్ సాఫ్రన్, జాన్ రికర్డ్ నిర్మాతలు. జాన్ సెనా కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రియాంక సామాజిక మాధ్యమాల వేదికగా వీడియోని పంచుకుంది. ‘ఏడాది పాటు చిత్రీకరణ జరిపాం. వినోదం నిండిన సెట్లో నైపుణ్యం కలిగిన వ్యక్తులతో కలిసి పనిచేసినందుకు గౌరవంగా ఉంది. ఇలాంటి ఓ గొప్ప కలయికలో మరో చిత్రం రాదేమో. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. మేము పంచుకున్న ఆ ఆనందాన్ని మీ అందరూ చూడాలని ఆశిస్తున్నాను’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. సముద్రపు దొంగ కథనంతో రూపొందుతున్న ‘ది బ్లఫ్’ అనే చిత్రంలోనూ ప్రియాంక కీలక పాత్రలో మెరవనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్‌తో అజిత్
కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్ రిలీజైంది. -
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘అగ్గంటుకుంది సంద్రం’.. ‘దేవర’ సాంగ్ వచ్చేసింది
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఇందులోని తొలి గీతం తాజాగా విడుదలైంది.
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
ఆమిర్ నటించిన ‘గజనీ’మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు నటుడు ప్రదీప్ రావత్ -
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్‌గేల్‌తో రిషబ్ ఫొటో
ధోనీపై కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. క్రిస్‌గేల్‌తో కలిసి దిగిన ఫొటోను రిషబ్ షేర్ చేశారు. -
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్‌కు ముందు అనుకున్న హీరోలెవరంటే?
సుమంత్ హీరోగా నటించిన ‘గోదావరి’కి 18 ఏళ్లు. ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
కథ కలిపింది..ఇద్దరినీ!
హిట్టు మాట వినిపించి... స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారంటే చాలు.. ఇక ఆ తర్వాత సదరు నాయికల ప్రయాణమంతా అందుకు తగ్గట్లుగా సాగాల్సిందే. -
కల్కి.. పాట వచ్చేస్తోంది
‘కల్కి 2898ఎ.డి’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ప్రభాస్. -
‘నా ఉచ్ఛ్వాసం కవనం’..
తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తీసుకువచ్చి, సరికొత్త పోకడ సృష్టించిన గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. -
సిద్ధార్థ్.. కృతి.. ఓ ప్రేమకథ?
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించి సినీప్రియుల మనసు దోచుకుంది బాలీవుడ్ నాయిక కృతి సనన్. -
సరికొత్త రొమాంటిక్ లవ్‌స్టోరీ
వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘సిల్క్ శారీ’. -
ఛోటా భీమ్ సూపర్ పవర్
‘ధైర్య సాహసాలతో తన ప్రాణాలు పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఒకడుంటాడు. -
పెట్స్‌పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్‌ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్‌ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్‌తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్‌రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!