Vijay devarakonda: కొత్త కథలతో ప్రయాణం

సరికొత్త కథలతో ప్రయాణం చేయనున్నారు విజయ్‌ దేవరకొండ. మొదట్నుంచీ ఆయనది అదే పంథానే. అందుకే యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు

Updated : 09 May 2024 09:59 IST

సరికొత్త కథలతో ప్రయాణం చేయనున్నారు విజయ్‌ దేవరకొండ. మొదట్నుంచీ ఆయనది అదే పంథానే. అందుకే యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఆయన సినీ ప్రయాణం గురించి పొరుగు భాషలు సైతం ఆసక్తిని వ్యక్తం చేశాయి. భవిష్యత్తులో మరిన్ని కొత్త నేపథ్యాల్ని, కొత్త రకమైన పాత్రల్ని స్పృశిస్తూ సినిమాలు చేయడం కోసం రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో... స్పై థ్రిల్లర్‌ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ విశాఖపట్నంలో జరుగుతోంది. గురువారం తన పుట్టినరోజుని ఈ సినిమా సెట్లోనే జరుపుకోనున్నారు విజయ్‌. ఈ సినిమా తర్వాత ఆయన చేయనున్న రెండు సినిమాలు ఇప్పటికే ఖరారయ్యాయి. రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో... గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్‌ డ్రామా కథలో నటించనున్నారు విజయ్‌. దిల్‌రాజు నిర్మాత. దీంతోపాటు మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో... రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకుడిగా ఓ సినిమా చేయనున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే పీరియాడిక్‌ కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారు. ఓ స్పై థ్రిల్లర్‌, ఓ పీరియాడిక్‌ కథ, గ్రామీణ నేపథ్యంలో సాగే మరో చిత్రం... ఇలా విభిన్నమైన కథలతో సరికొత్త ప్రయాణం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు విజయ్‌ దేవరకొండ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని