Sai Pallavi: సంద్రంలో జాలరి.. తీరంలో అల్లరి

సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్న కథానాయిక... సాయిపల్లవి. ‘తండేల్‌’లో బుజ్జితల్లిగా సందడి చేయనుంది.

Updated : 09 May 2024 10:00 IST

సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్న కథానాయిక... సాయిపల్లవి. ‘తండేల్‌’లో బుజ్జితల్లిగా సందడి చేయనుంది. కథానాయకుడు నాగచైతన్య జాలరి పాత్రలో కనిపిస్తే... సాయిపల్లవి ఆయనతో కలిసి అల్లరి చేయనుంది. గురువారం సాయిపల్లవి పుట్టినరోజు. ఈ సందర్భంగా బుధవారం ‘తండేల్‌’లోని ఆమె లుక్‌ని విడుదల చేశారు. సాగర తీరాన కూర్చుని నవ్వుతూ ఫోన్‌లో మాట్లాడుతున్న ఆ లుక్‌ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతోంది. గురువారం సాయిపల్లవి పుట్టినరోజు ప్రత్యేకంగా ఓ వీడియోని విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రమిది. బన్నీ వాస్‌ నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పకులు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని